అన్వేషించండి › అంశాలు › బల్లలు, భోజనాలు
దైనందిన జీవితం
బైబిల్లో బల్లలు, భోజనాలు
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 36 భాగాలు, వాక్యం వాక్యంగా.
బల్లలు
- ఎలీషా చిన్న గదిలో ఒక మంచం, ఒక బల్ల, ఒక కుర్చీ, ఒక దీపం2 రాజులు 4:10
వచనాలు
2 రాజులు 4:10కాబట్టి మనం మిద్దె మీద ఒక చిన్న గది కడదాం. అందులో ఒక మంచం, బల్ల, కుర్చీ, ఒక లాంతరూ ఏర్పాటు చేద్దాం. ఆయన మన దగ్గరికి వచ్చిన ప్రతిసారీ అందులో ఉంటాడు.”
- అదోనీ బెజెకు బల్ల కింద డెబ్బై మంది రాజులు ముక్కలు ఏరుకున్నారున్యాయా 1:7
వచనాలు
న్యాయా 1:7అప్పుడు అదోనీ బెజెకు “ఇలా కాళ్లు, చేతుల బొటన వేళ్ళు కోసిన డెభ్భైమంది రాజులు నా భోజనపు బల్ల కింద ముక్కలు ఏరుకోనేవాళ్ళు. నేను చేసినదానికి దేవుడు నాకు ప్రతిఫలమిచ్చాడు” అన్నాడు. వాళ్ళు అతణ్ణి యెరూషలేముకు తీసుకొచ్చారు. అతడు అక్కడ చనిపోయాడు.
- ప్రత్యక్ష గుడారపు బల్ల: బంగారు రేకు పొదిగిన తుమ్మకర్ర, మోయడానికి దండెలునిర్గ 25:23–28
వచనాలు
నిర్గ 25:23–28నీవు తుమ్మచెక్కతో ఒక బల్ల చేయాలి. దాని పొడవు రెండు మూరలు. వెడల్పు ఒక మూర. దాని ఎత్తు మూరెడున్నర. మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి బంగారు అంచును చేయించాలి. దానికి చుట్టూ బెత్తెడు చట్రం చేసి దానిపై చుట్టూ బంగారు అంచు పెట్టాలి. దానికి నాలుగు బంగారు రింగులు చేసి దాని నాలుగు కాళ్లకి ఉండే నాలుగు మూలల్లో ఆ రింగులను తగిలించాలి. బల్లను మోయడానికి చేసిన మోతకర్రలు రింగులకు, చట్రానికి దగ్గరగా ఉండాలి. ఆ మోతకర్రలను తుమ్మచెక్కతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగించాలి. వాటితో బల్లను మోస్తారు.
- ప్రతి విశ్రాంతి దినాన బంగారు బల్ల మీద రెండు వరుసల్లో పన్నెండు రొట్టెలులేవీ 24:5–8
వచనాలు
లేవీ 24:5–8నీవు గోదుమ పిండి తీసుకుని దానితో పన్నెండు రొట్టెలు చెయ్యాలి. ఒక్కొక్క రొట్టెకు రెండు కిలోల పిండి వాడాలి. యెహోవా సన్నిధిలో నిర్మలమైన బల్లమీద ఆరేసి రొట్టెలున్న రెండు దొంతులుగా వాటిని ఉంచాలి. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచాలి. అది యెహోవా కోసం పరిమళ హోమం. యాజకుడు ప్రతి విశ్రాంతి దినాన నిత్య నిబంధన ప్రకారం ఇశ్రాయేలీయుల పక్షంగా ఆ రొట్టెలు బల్లపై పెడుతూ ఉండాలి.
- దేవాలయం కోసం బంగారు బల్లలు, వెండి బల్లలు1 దిన 28:16
వచనాలు
1 దిన 28:16సన్నిధి రొట్టెలు ఉంచే ఒక్కొక బల్లకు కావలసినంత బంగారం తూకం ప్రకారంగా వెండి బల్లలకు కావలసినంత వెండినీ,
- యేసు రూకలు మార్చేవారి బల్లలను పడదోస్తాడుయోహా 2:15
వచనాలు
యోహా 2:15ఆయన పేనిన తాళ్ళను ఒక కొరడాగా చేసి దానితో వారందర్నీ దేవాలయం నుండి వెళ్ళగొట్టాడు. గొర్రెలనూ ఎద్దులనూ కూడా అక్కడి నుంచి తోలివేశాడు. డబ్బును మారకం చేసే వారి బల్లలను పడదోశాడు. వారి డబ్బును చెల్లాచెదరు చేశాడు.
- బల్ల కింది కుక్కలు పిల్లలు పడేసే ముక్కలు తింటాయిమత్తయి 15:27, మార్కు 7:28
వచనాలు
మత్తయి 15:27ఆమె, “ప్రభూ, నిజమే! కాని కుక్కపిల్లలు సైతం తమ యజమాని భోజనం బల్లపై నుండి కింద పడే ముక్కలు తింటాయి కదా” అంది.
మార్కు 7:28అందుకామె, “ఔను ప్రభూ! అది నిజమే గాని, బల్లకింద ఉన్న కుక్కలు కూడా పిల్లలు పడేసిన ముక్కలు తింటాయి కదా!” అని జవాబు ఇచ్చింది.
- ధనవంతుని బల్ల మీద నుంచి పడే ముక్కల కోసం లాజరు ఆశపడతాడు (ఉపమానం)లూకా 16:21
వచనాలు
లూకా 16:21ధనవంతుని భోజన బల్ల పైనుంచి కింద పడే రొట్టె ముక్కలతో తన ఆకలి తీర్చుకోడానికి ప్రయత్నం చేసేవాడు. అంతేకాకుండా వీధి కుక్కలు వచ్చి అతని కురుపులు నాకేవి.
- నీ బల్ల చుట్టూ నీ కుమారులు ఒలీవ మొక్కల్లాకీర్త 128:3
వచనాలు
కీర్త 128:3నీ ఇంట్లో నీ భార్య ఫలవంతమైన ద్రాక్షాతీగెలాగా ఉంటుంది. నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల్లాగా ఉంటారు.
కూర్చోవడం, ఆనుకోవడం
- అతిథులు తింటుండగా అబ్రాహాము చెట్టు కింద వారి దగ్గర నిలబడతాడుఆది 18:8
వచనాలు
ఆది 18:8తరువాత అతడు పెరుగూ, పాలూ వాటితోపాటు తాను వండించి సిద్ధం చేయించిన దూడ మాంసాన్ని తెచ్చి వాళ్ళ ముందు పెట్టాడు. వాళ్ళు భోజనం చేస్తుంటే అక్కడే ఆ చెట్టు కిందే నిలబడ్డాడు.
- భోజన సమయంలో రూతు కోతగాళ్ళ పక్కన కూర్చుంటుందిరూతు 2:14
వచనాలు
రూతు 2:14భోజన సమయంలో బోయజు “నువ్వు ఇక్కడికే వచ్చి భోజనం చెయ్యి. నీ రొట్టెముక్కలను ద్రాక్షారసంలో ముంచుకుని తిను” అని చెప్పాడు. కాబట్టి ఆమె పంట కోసే వాళ్ళ దగ్గర కూర్చుంది. బోయజు ఆమెకు కొన్ని పేలాలు ఇచ్చాడు. ఆమె కొన్ని తృప్తిగా తిని కొన్ని మిగిల్చింది.
- రాణి ఎస్తేరు ఆనుకుని ఉన్న ఆసనం మీద హామాను పడతాడుఎస్తే 7:8
వచనాలు
ఎస్తే 7:8అంతఃపురం తోటలోనుండి ద్రాక్షారసం విందు స్థలానికి రాజు తిరిగి వచ్చి ఎస్తేరు కూర్చున్న తల్పం మీద హామాను పడి ఉండడం చూశాడు. “వీడు నా ఇంట్లో నేను చూస్తుండగానే రాణిని బలాత్కారం చేస్తాడా?” అన్నాడు. ఆ మాట రాజు నోట రాగానే సైనికులు హామాను ముఖానికి ముసుకు వేశారు.
- యేసు పన్నెండుమందితో భోజనానికి కూర్చుంటాడుమత్తయి 26:20
వచనాలు
మత్తయి 26:20సాయంకాలం యేసు తన పన్నెండు మంది శిష్యులతో భోజనానికి కూర్చున్నాడు.
- యేసు పక్కన ఆనుకుని ఉన్న శిష్యుడు ఆయనను అడగడానికి వెనక్కి ఆనుకుంటాడుయోహా 13:23–25
వచనాలు
యోహా 13:23–25భోజనం బల్ల దగ్గర, ఆయన శిష్యుల్లో ఒకడైన యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు రొమ్మున ఆనుకుని ఉన్నాడు. సీమోను పేతురు ఆ శిష్యుడికి, “యేసు ఎవరి గురించి అలా అన్నాడన్న విషయాన్ని ఆయన్ని అడిగి తెలుసుకో” అని సైగ చేశాడు. ఆ శిష్యుడు యేసు రొమ్మున ఆనుకుని ఆయనతో, “ప్రభూ, ఆ వ్యక్తి ఎవరు?” అని అడిగాడు.
- ఒక పరిసయ్యుడు యేసును భోజనానికి పిలుస్తాడు; ఆయన బల్ల దగ్గర కూర్చుంటాడులూకా 7:36
వచనాలు
లూకా 7:36పరిసయ్యుల్లో ఒకడు తనతో భోజనం చేయాలని ఆయనను ఆహ్వానించాడు. ఆయన ఆ పరిసయ్యుడి ఇంటికి వెళ్ళి భోజనానికి కూర్చున్నాడు.
- మార్త వడ్డిస్తుంది; లాజరు యేసుతో పాటు బల్ల దగ్గర కూర్చుంటాడుయోహా 12:2
వచనాలు
యోహా 12:2అక్కడ ఆయన కోసం భోజనం ఏర్పాటు చేశారు. మార్త వడ్డిస్తూ ఉంది. యేసుతో భోజనం బల్ల దగ్గర కూర్చున్నవారిలో లాజరు కూడా ఒకడు.
- ఐదు వేల మంది వందల, యాభైల గుంపులుగా పచ్చికపై కూర్చుంటారుమార్కు 6:39–40, లూకా 9:14
వచనాలు
మార్కు 6:39–40అప్పుడాయన అందరినీ గుంపులు గుంపులుగా పచ్చగడ్డి మీద కూర్చోబెట్టమని శిష్యులతో చెప్పాడు. ప్రజలు గుంపుకు యాభైమంది, వందమంది చొప్పున కూర్చున్నారు.
లూకా 9:14అక్కడ సుమారు పురుషులే ఐదు వేలమంది ఉన్నారు. ఆయన, “వారిని యాభై మంది చొప్పున బారులు తీర్చి కూర్చోబెట్టండి” అని శిష్యులతో చెప్పాడు.
ఎవరు ఎవరితో తిన్నారు
- సౌలు బల్ల దగ్గర దావీదు లేడు; యోనాతాను కోపంతో దాన్ని విడిచి లేస్తాడు1 సమూ 20:29, 1 సమూ 20:34
వచనాలు
1 సమూ 20:29దయచేసి నన్ను వెళ్లనివ్వు, పట్టణంలో మా యింటివారు బలి అర్పించబోతున్నారు, నువ్వు కూడా రావాలని మా అన్న నాకు కబురు పంపాడు. కాబట్టి నాపై దయ చూపించి నేను వెళ్లి నా సోదరులను కలుసుకోనేలా నాకు సెలవిమ్మని బతిమాలుకుని నా దగ్గర సెలవు తీసుకున్నాడు. అందువల్లనే అతడు రాజుగారి భోజనపు బల్ల దగ్గరికి రాలేదు” అని సౌలుతో చెప్పాడు.
1 సమూ 20:34అమితమైన కోపం తెచ్చుకుని బల్ల దగ్గర నుండి లేచి, తన తండ్రి దావీదును అవమానపరచినందు వల్ల అతని కోసం దుఃఖపడుతూ అమావాస్య అయిపోయిన మరుసటి రోజు భోజనం మానేశాడు.
- సొలొమోను బల్లకు వచ్చే వారందరికీ అధికారులు ఆహారం సరఫరా చేస్తారు1 రాజులు 4:27
వచనాలు
1 రాజులు 4:27సొలొమోనుకు, అతని భోజనపు బల్ల దగ్గరికి వచ్చిన వారికందరికీ ఏమీ తక్కువ కాకుండా అధికారుల్లో ప్రతి ఒక్కడూ తనకు అప్పగించిన నెలను బట్టి ఆహారం పంపుతూ వచ్చారు.
- సొలొమోను బల్లనూ అతని సేవకులు కూర్చునే తీరునూ చూసి షేబ రాణి ఆశ్చర్యపోతుంది1 రాజులు 10:4–5
వచనాలు
1 రాజులు 10:4–5షేబ రాణి సొలొమోను జ్ఞానాన్ని, అతడు కట్టించిన మందిరాన్ని, అతని భోజనం బల్ల మీద ఉన్న పదార్థాలను, అతని సేవకులు కూర్చునే ఆసనాలను అతని పరిచారకులు కనిపెట్టి చూసే విధానం, వారి వస్త్రాలను, అతనికి రస పాత్రలను అందించేవారిని, యెహోవా మందిరంలో అతడు అర్పించే దహనబలులను చూసింది. ఆమెకు కలిగిన ఆశ్చర్యం ఇంతింత కాదు.
- అతిథులు కాకుండా చాలామంది యూదులూ అధికారులూ నెహెమ్యా బల్ల దగ్గర భోజనం చేస్తారునెహె 5:17
వచనాలు
నెహె 5:17నా భోజనం బల్ల దగ్గర మా చుట్టూ ఉన్న అన్యదేశాల నుండి వచ్చిన ప్రజలతోపాటు యూదులు, అధికారులు మొత్తం 150 మంది మాతో కలసి భోజనం చేసేవాళ్ళు.
- యెహోయాకీను జీవితాంతం బబులోను రాజు బల్ల దగ్గర భోజనం చేస్తాడు2 రాజులు 25:29
వచనాలు
2 రాజులు 25:29అతడు తన చెరసాల బట్టలు తీసేసి వేరే వస్త్రాలు వేసుకుని తాను బ్రతికిన రోజులన్నీ రాజు బల్ల మీద రాజుతో భోజనం చేస్తూ వచ్చాడు.
- మత్తయి ఇంట్లో యేసు సుంకం వసూలు చేసేవారితో, పాపులతో భోజనం చేస్తాడుమత్తయి 9:10–11, మార్కు 2:15–16, లూకా 15:2
వచనాలు
మత్తయి 9:10–11యేసు మత్తయి ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పుడు చాలామంది పన్ను వసూలు చేసే వారూ పాపులూ వచ్చి ఆయనతో, ఆయన శిష్యులతో కూర్చున్నారు. పరిసయ్యులు అది గమనించి, “మీ బోధకుడు పన్ను వసూలు చేసే వారితో, పాపులతో కలిసి తింటున్నాడేంటి?” అని ఆయన శిష్యులను అడిగారు.
మార్కు 2:15–16యేసు లేవి ఇంట్లో భోజనం చేస్తున్నపుడు పన్ను వసూలు చేసేవారు, పాపులు, చాలామంది ఆయనతో, ఆయన శిష్యులతో కలిసి భోజనం చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది ఆయనను వెంబడిస్తున్నారు. అది చూసి ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యులు ఆయన శిష్యులతో, “ఈయన పాపులతో, పన్ను వసూలు చేసేవారితో కలిసి భోజనం చేస్తున్నాడేమిటి?” అన్నారు.
లూకా 15:2పరిసయ్యులూ, ధర్మశాస్త్ర పండితులూ అది చూసి, “ఈ మనిషి పాపులను దగ్గరికి రానిస్తూ వారితో కలసి భోజనం చేస్తున్నాడు” అని సణుక్కున్నారు.
- “నన్ను శత్రువులకు పట్టించే వాడు నాతో కూడా ఈ బల్ల దగ్గరే ఉన్నాడు”లూకా 22:21
వచనాలు
లూకా 22:21“వినండి, నన్ను శత్రువులకు పట్టించే వాడు నాతో కూడా ఈ బల్ల దగ్గరే ఉన్నాడు.
- తిరిగి లేచిన యేసు: “రండి, భోజనం చేయండి”యోహా 21:12
వచనాలు
యోహా 21:12అప్పుడు యేసు, “రండి, భోజనం చేయండి” అని వారిని పిలిచాడు. అప్పటికి ఆయన ప్రభువని వారికి తెలిసి పోయింది కాబట్టి, “నువ్వు ఎవరు” అని అడిగే సాహసం ఎవరూ చేయలేదు.
- మొదటి విశ్వాసులు ఇంటింటా రొట్టె విరుస్తారుఅపొ.కా 2:46
వచనాలు
అపొ.కా 2:46ప్రతిరోజూ ఏక మనసుతో దేవాలయంలో సమావేశమౌతూ ఇళ్ళలో రొట్టె విరుస్తూ,
- బల్లల దగ్గర సేవ చేయడానికి పన్నెండుమంది సువార్త ప్రకటనను విడిచిపెట్టాలనుకోరుఅపొ.కా 6:2
వచనాలు
అపొ.కా 6:2అప్పుడు పన్నెండుమంది అపొస్తలులు శిష్యుల సమూహాన్ని తమ దగ్గరికి పిలిచి, “మేము దేవుని వాక్యాన్ని బోధించడం మాని భోజనాలు వడ్డించడం మంచిది కాదు.
- సున్నతి లేనివారితో తిన్నందుకు పేతురును విమర్శిస్తారుఅపొ.కా 11:3
వచనాలు
అపొ.కా 11:3“నీవు సున్నతి లేని వారి దగ్గరికి పోయి వారితో భోజనం చేశావు” అని అతనిని విమర్శించారు.
- అంతియొకయలో పేతురు యూదేతరులతో భోజనం చేయడం మానుకుంటాడుగలతీ 2:12
వచనాలు
గలతీ 2:12ఎందుకంటే, యాకోబు దగ్గర నుంచి కొంతమంది రాక ముందు అతడు యూదేతరులతో భోజనం చేస్తున్నాడు. వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనక్కి తగ్గి, పక్కకి వెళ్ళిపోయాడు.
- చెరసాల అధికారి పౌలుకూ సీలకూ భోజనం వడ్డిస్తాడుఅపొ.కా 16:34
వచనాలు
అపొ.కా 16:34అతడు పౌలు సీలలను తన ఇంటికి తీసికెళ్ళి భోజనం పెట్టి, తాను దేవునిలో విశ్వాసముంచినందుకు తన ఇంటి వారందరితో కూడ ఆనందించాడు.
- అవిశ్వాసి పిలిచాడా? మీ ముందు పెట్టినదేదైనా తినండి1 కొరింతీ 10:27
వచనాలు
1 కొరింతీ 10:27ప్రభువుని నమ్మని ఎవరైనా మిమ్మల్ని భోజనానికి పిలిస్తే, మీకు ఇష్టమైతే వెళ్ళండి. అక్కడ మీకు వడ్డించినది ఏదైనా సరే, మీ మనస్సాక్షి ననుసరించి ప్రశ్నలేవీ అడగకుండా తినండి.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు