అన్వేషించండి › అంశాలు › వ్యాధి, వైద్యులు
దైనందిన జీవితం
బైబిల్‌లో వ్యాధి, వైద్యులు
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 41 భాగాలు, వాక్యం వాక్యంగా.
వైద్యులు
- యోసేపు వైద్యులు యాకోబు శరీరాన్ని సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేస్తారుఆది 50:2
వచనాలు
ఆది 50:2యోసేపు సుగంధ ద్రవ్యాలతో తన తండ్రి శవాన్ని సిద్ధపరచాలని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించాడు. కాబట్టి ఆ వైద్యులు ఇశ్రాయేలు శవాన్ని సిద్ధపరచారు.
- పాదాల వ్యాధితో ఉన్న ఆసా వైద్యులను ఆశ్రయిస్తాడు2 దిన 16:12, 1 రాజులు 15:23
వచనాలు
2 దిన 16:12ఆసా తన పాలనలో 39 వ సంవత్సరంలో అతనికి పాదాల్లో జబ్బు పుట్టింది. దానితో అతడు చాలా బాధపడినప్పటికీ దాని విషయంలో యెహోవా సహాయం కోరకుండా వైద్యులను నమ్ముకున్నాడు.
1 రాజులు 15:23ఆసా గురించిన మిగతా విషయాలు, అతని బలప్రభావాలూ అతడు చేసినదంతా అతడు కట్టించిన పట్టణాలను గురించి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాసి వుంది. ముసలితనంలో అతని పాదాలకు జబ్బు చేసింది.
- పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావంతో ఉన్న స్త్రీ వైద్యులకు తనకున్నదంతా ఖర్చు చేసిందిమార్కు 5:25–26, లూకా 8:43
వచనాలు
మార్కు 5:25–26పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో ఉన్న ఒక స్త్రీ ఆ సమూహంలో ఉంది. ఆమె చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. కాని, ఆమె బాధ తగ్గలేదు. తన డబ్బంతా ఖర్చు చేసింది. అయినా జబ్బు నయం కావడానికి బదులు ఆమె పరిస్థితి ఇంకా క్షీణించింది.
లూకా 8:43అప్పుడు పన్నెండేళ్ళ నుండి రక్త స్రావ రోగంతో బాధ పడుతున్న ఒక స్త్రీ అక్కడ ఉంది. ఆమె తనకున్నదంతా వైద్యులకు ఖర్చు చేసింది. కానీ ఎక్కడా నయం కాలేదు.
- “ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అవసరం లేదు. రోగులకే అవసరం”మత్తయి 9:12
వచనాలు
మత్తయి 9:12యేసు అది విని, “ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అవసరం లేదు. రోగులకే అవసరం.
- ఒక సామెత: “వైద్యుడా, నిన్ను నీవే బాగు చేసుకో”లూకా 4:23
వచనాలు
లూకా 4:23ఆయన వారితో, “వైద్యుడా, నిన్ను నీవే బాగు చేసుకో” అనే సామెత నాకు చెప్పి, కపెర్నహూములో నీవు చేసిన వాటన్నిటినీ మేము విన్నాం, వాటిని ఈ నీ సొంత ఊరులో కూడా చేయమని మీరు తప్పకుండా నాతో అంటారు” అన్నాడు.
- “ప్రియ వైద్యుడు లూకా”కొలస్స 4:14
వచనాలు
కొలస్స 4:14ప్రియ వైద్యుడు లూకా, దేమా మీకు అభివందనాలు చెబుతున్నారు.
- “గిలాదులో ఔషధం ఏమీ లేదా? అక్కడ వైద్యుడెవరూ లేరా?”యిర్మీ 8:22
వచనాలు
యిర్మీ 8:22గిలాదులో ఔషధం ఏమీ లేదా? అక్కడ వైద్యుడెవరూ లేరా? నా ప్రజలకు ఎందుకు స్వస్థత కలగడం లేదు?
మందులు
- హిజ్కియా పుండుకు అంజూరపు పండ్ల ముద్ద2 రాజులు 20:7, యెష 38:21
వచనాలు
2 రాజులు 20:7తరువాత యెషయా “అంజూరపుపళ్ళ ముద్ద తెప్పించండి” అని చెప్పాడు. వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగు పడ్డాడు.
యెష 38:21యెషయా “ఒక అంజూరు పండ్ల ముద్దను ఆ పుండుకు కట్టండి, అప్పుడు అతడు బాగుపడతాడు” అని చెప్పాడు.
- సమరయుడు నూనె, ద్రాక్షారసం పోసి గాయాలకు కట్లు కడతాడులూకా 10:34
వచనాలు
లూకా 10:34అతనిపై నూనే, ద్రాక్షారసం పోసి, గాయాలకు కట్లు కట్టి తన గాడిదపై ఎక్కించుకుని ఒక సత్రానికి తీసుకువెళ్ళి అతని బాగోగులు చూశాడు.
- కడుపు కోసం, తరచుగా వచ్చే జబ్బుల కోసం కొంచెం ద్రాక్షారసం1 తిమో 5:23
వచనాలు
1 తిమో 5:23ఇక నుండి నీళ్ళు మాత్రమే గాక నీ కడుపులో తరచుగా వచ్చే వ్యాధి కోసం కొద్దిగా ద్రాక్షారసం తాగు.
- రోగులకు నూనె రాసేవారుమార్కు 6:13, యాకో 5:14
వచనాలు
మార్కు 6:13ఎన్నో దయ్యాలను వదిలించారు. శిష్యులు అనేకమంది రోగులను నూనె రాసి బాగుచేశారు.
యాకో 5:14మీలో ఎవరైనా జబ్బు పడ్డాడా? అతడు సంఘ పెద్దలను పిలిపించుకోవాలి, వారు ప్రభువు నామంలో అతనికి నూనె రాసి అతని కోసం ప్రార్థన చేయాలి.
- సంతోషమైన హృదయం మంచి ఔషధంసామె 17:22
వచనాలు
సామె 17:22ఆహ్లాదకరమైన మనస్సు మంచి ఔషధం. చితికిపోయిన మనస్సు వల్ల ఎముకలు ఎండిపోతాయి.
ఉదాహరణలు
- యాకోబు జబ్బుపడతాడు; యోసేపు తన ఇద్దరు కుమారులను తీసుకువస్తాడుఆది 48:1
వచనాలు
ఆది 48:1ఈ సంగతులైన తరువాత “ఇదిగో, మీ నాన్నకు ఒంట్లో బాగాలేదు” అని ఒకడు యోసేపుతో చెప్పాడు. అప్పుడతడు మనష్షే, ఎఫ్రాయిము అనే తన ఇద్దరు కొడుకులను వెంటబెట్టుకుని వెళ్ళాడు.
- జబ్బుపడిన ఐగుప్తు దాసుణ్ణి అతని యజమాని విడిచిపెడతాడు1 సమూ 30:13
వచనాలు
1 సమూ 30:13అప్పుడు దావీదు “నీవు ఏ దేశం వాడివి? ఎక్కడనుండి వచ్చావు?” అని అడిగాడు. అందుకు వాడు “నేను ఐగుప్తు వాణ్ణి. ఒక అమాలేకీయుడికి బానిసనయ్యాను. మూడు రోజుల క్రితం నాకు జబ్బు చేసింది. నా యజమాని నన్ను వదిలి వెళ్ళిపోయాడు.
- యరొబాము కుమారుడు జబ్బుపడతాడు; అతని తల్లి మారువేషంలో ప్రవక్త దగ్గరికి వెళ్తుంది1 రాజులు 14:1–3
వచనాలు
1 రాజులు 14:1–3అదే రోజుల్లో యరొబాము కొడుకు అబీయాకు జబ్బు చేసింది. యరొబాము తన భార్యతో ఇలా అన్నాడు. “నీవు లేచి యరొబాము భార్యవని ఎవరికీ తెలియకుండా మారువేషం వేసుకుని షిలోహు వెళ్ళు. ఈ ప్రజల మీద నేను రాజునవుతానని నాకు చెప్పిన ప్రవక్త అహీయా అక్కడున్నాడు. కాబట్టి నీవు పది రొట్టెలూ కొన్ని తీపి రొట్టెలు, ఒక సీసా నిండా తేనె తీసుకుని అతని దగ్గరికి వెళ్ళు. అబ్బాయికి ఏమవుతుందో అతడు నీకు చెబుతాడు.”
- సారెపతులోని వితంతువు కుమారుడు జబ్బుపడతాడు1 రాజులు 17:17
వచనాలు
1 రాజులు 17:17కొంతకాలం తరువాత ఆ వితంతువు కొడుక్కి జబ్బు చేసింది. జబ్బు ముదిరి, అతడు చనిపోయాడు.
- పొలంలో షూనేమీయురాలి కొడుకు: “నా తల! నా తల!”2 రాజులు 4:18–20
వచనాలు
2 రాజులు 4:18–20ఆ పిల్లవాడు పెరిగిన తరువాత ఒక రోజు పొలంలో కోత కోస్తున్న వాళ్ళ దగ్గర ఉన్న తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ వాడు తన తండ్రితో “నా తల! నా తల!” అన్నాడు. వాడి తండ్రి తన సేవకుడితో “పిల్లాణ్ణి ఎత్తుకుని వాళ్ళమ్మ దగ్గరికి తీసుకు వెళ్ళు” అన్నాడు. వాడు ఆ పిల్లవాణ్ణి తీసుకుని తల్లి దగ్గరికి తీసుకు వెళ్ళాడు. వాడు మధ్యాహ్నం వరకూ తల్లి ఒడిలో పడుకుని తరువాత చనిపోయాడు.
- జాలీలోనుంచి పడి అహజ్యా గాయపడతాడు2 రాజులు 1:2
వచనాలు
2 రాజులు 1:2అప్పుడే అహజ్యా షోమ్రోనులోని తన మేడగది కిటికీలో నుండి కింద పడి గాయపడ్డాడు. అప్పుడతడు దూతలను పిలిచి “మీరు ఎక్రోను దేవుడు బయల్జెబూబు దగ్గరికి వెళ్ళి ఈ గాయం మాని బాగుపడతానో లేదో కనుక్కుని రండి” అని వారికి చెప్పి పంపించాడు.
- తాను బాగుపడతానో లేదో అని అరాము రాజు బెన్హదదు ఎలీషాను అడిగిస్తాడు2 రాజులు 8:7–8
వచనాలు
2 రాజులు 8:7–8ఎలీషా దమస్కుకి వచ్చాడు. అక్కడ సిరియా రాజు బెన్హదదు జబ్బు పడి ఉన్నాడు. “దేవుని మనిషి ఇక్కడికి వచ్చాడు” అని రాజుకు చెప్పారు. రాజు హజాయేలును పిలిచాడు. “నీవు ఒక కానుక తీసుకుని దేవుని మనిషి దగ్గరికి వెళ్ళు. ‘నాకు నయమౌతుందా లేదా’ అని అతని ద్వారా యెహోవా దగ్గర సంప్రదించు” అని చెప్పాడు.
- ఎలీషా తాను చనిపోయిన వ్యాధితో జబ్బుపడతాడు2 రాజులు 13:14
వచనాలు
2 రాజులు 13:14ఎలీషా మరణాంతక వ్యాధి బారిన పడ్డాడు. ఇశ్రాయేలు రాజు యెహోయాషు అతని దగ్గరికి వచ్చి అతణ్ణి చూసి కన్నీరు కారుస్తూ “నా తండ్రీ, నా తండ్రీ, ఇశ్రాయేలు ప్రజలకు రథం, అశ్వికదళం నువ్వే కదా” అని విలపించాడు.
- హిజ్కియా చావుకు దగ్గరగా జబ్బుపడి, తర్వాత కోలుకుంటాడుయెష 38:1, 2 రాజులు 20:7
వచనాలు
యెష 38:1ఆ రోజుల్లో హిజ్కియాకు ప్రాణాంతకమైన జబ్బు చేసింది. ప్రవక్త, ఆమోజు కొడుకు యెషయా అక్కడకు వచ్చాడు. “‘నువ్వు చనిపోబోతున్నావు, ఇక బతకవు. కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో’ అని యెహోవా సెలవిస్తున్నాడు” అని చెప్పాడు.
2 రాజులు 20:7తరువాత యెషయా “అంజూరపుపళ్ళ ముద్ద తెప్పించండి” అని చెప్పాడు. వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగు పడ్డాడు.
- పుండ్లతో కప్పబడిన యోబు పెంకుతో తనను తాను గీరుకుంటాడుయోబు 2:7–8
వచనాలు
యోబు 2:7–8సాతాను యెహోవా సముఖం నుండి బయలుదేరి వెళ్లి, యోబు అరికాలు నుండి నడినెత్తి వరకూ బాధ కలిగించే కురుపులు పుట్టించాడు. అతడు తన ఒళ్లు గోక్కోవడానికి ఒక చిల్లపెంకు తీసుకుని బూడిదలో కూర్చున్నాడు.
- ఒక దర్శనం తర్వాత దానియేలు కొన్ని రోజులు జబ్బుపడి ఉంటాడుదాని 8:27
వచనాలు
దాని 8:27దానియేలు అనే నేను తట్టుకోలేక కొన్నాళ్లు నీరసంగా పడి ఉన్నాను. తరువాత నేను లేచి రాజు కోసం చేయవలసిన పని చేస్తూ వచ్చాను. ఈ దర్శనాన్ని గూర్చి నిర్ఘాంతపోయిన స్థితిలో ఉండిపోయాను. దాన్ని అర్థం చేసుకోగలిగిన వారెవరూ లేరు.
- పేతురు అత్త తీవ్రమైన జ్వరంతో మంచం మీద ఉందిమత్తయి 8:14, లూకా 4:38
వచనాలు
మత్తయి 8:14తరవాత యేసు, పేతురు ఇంట్లోకి వెళ్ళి, జ్వరంతో పడుకుని ఉన్న అతని అత్తను చూశాడు.
లూకా 4:38ఆయన సమాజ మందిరం నుండి, సీమోను ఇంటికి వెళ్ళాడు. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉంది. ఆమెను బాగు చేయాలని వారాయన్ని బతిమిలాడారు.
- కపెర్నహూములో ఒక రాజోద్యోగి కుమారుడు జబ్బుపడి ఉన్నాడుయోహా 4:46–47
వచనాలు
యోహా 4:46–47యేసు గలిలయలోని కానా అనే ఊరికి వచ్చాడు. ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చింది ఇక్కడే. అదే సమయంలో కపెర్నహూములో ఒక అధికారి కొడుకు జబ్బుపడి ఉన్నాడు. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చాడని అతడు విన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. తన కొడుకు చావడానికి సిద్ధంగా ఉన్నాడనీ వచ్చి బాగుచేయాలనీ ఆయనను వేడుకున్నాడు.
- మూర్ఛరోగి అయిన ఒక బాలుడు తరచుగా నిప్పులో గాని నీళ్ళలో గాని పడతాడుమత్తయి 17:15
వచనాలు
మత్తయి 17:15“ప్రభూ, నా కొడుకును కనికరించు. వాడు మూర్ఛరోగి. చాలా బాధపడుతున్నాడు. పదే పదే నిప్పుల్లో నీళ్ళలో పడిపోతుంటాడు.
- బేతెస్ద కోనేరు దగ్గర చాలామంది రోగులు; ఒకడు ముప్ఫై ఎనిమిదేళ్ళుగాయోహా 5:2–4, యోహా 5:5
వచనాలు
యోహా 5:2–4యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర ఒక కోనేరు ఉంది. హీబ్రూ భాషలో దాని పేరు బేతెస్ద. దానికి ఐదు మంటపాలున్నాయి. (కొన్ని సమయాల్లో ప్రభువు దూత నీటిలోకి దిగి ఆ నీటిని కదిలిస్తూ ఉండేవాడు. అలా నీరు కదలగానే మొదటగా ఎవరైతే నీటిలోకి దిగుతారో అతనికి వ్యాధి నివారణ జరిగేది). రకరకాల రోగాలున్నవారూ, గుడ్డివారూ, కుంటివారూ చచ్చుబడిన కాళ్ళూ చేతులున్నవారూ గుంపులుగా ఆ మంటపాల్లో పడి ఉన్నారు.
యోహా 5:5అక్కడ ముప్ఫై ఎనిమిది సంవత్సరాల నుండి ఒక వ్యక్తి అంగ వైకల్యంతో పడి ఉన్నాడు.
- పుట్టుకతో కుంటివాణ్ణి ప్రతి రోజు దేవాలయ ద్వారం దగ్గరికి మోసుకువస్తారుఅపొ.కా 3:2
వచనాలు
అపొ.కా 3:2పుట్టినప్పటి నుండి కుంటివాడుగా ఉన్న ఒకణ్ణి కొందరు ప్రతిరోజూ మోసుకొచ్చి ‘సౌందర్యం’ అనే దేవాలయ ద్వారం దగ్గర ఉంచేవారు. వాడు దేవాలయంలోకి వెళ్ళేవారి దగ్గర బిచ్చమెత్తుకునే వాడు.
- బేతనియ వాడైన లాజరు జబ్బుపడతాడు; అతని సోదరీలు యేసుకు కబురు పంపుతారుయోహా 11:1–3
వచనాలు
యోహా 11:1–3బేతనియ గ్రామానికి చెందిన లాజరుకు జబ్బు చేసింది. మరియ, మార్త అతని సోదరీలు. ఈ మరియే ప్రభువు పాదాలకు అత్తరు పూసి తన తల వెంట్రుకలతో తుడిచిన మరియ. అప్పుడు ఆ అక్క చెల్లెళ్ళు, “ప్రభూ, నువ్వు ప్రేమించే వాడికి జబ్బు చేసింది” అని యేసుకు కబురు పంపించారు.
- దోర్కా జబ్బుపడి చనిపోతుందిఅపొ.కా 9:37
వచనాలు
అపొ.కా 9:37ఆ రోజుల్లో ఆమె జబ్బుపడి చనిపోయింది. ఆమె శవానికి స్నానం చేయించి మేడ గదిలో ఉంచారు.
- పొప్లి తండ్రి జ్వరంతో, రక్తవిరేచనాలతో జబ్బుపడి ఉన్నాడుఅపొ.కా 28:8
వచనాలు
అపొ.కా 28:8ఆ సమయంలో పొప్లి తండ్రి జ్వరం, రక్త విరేచనాల చేత బాధపడుతూ పండుకుని ఉన్నాడు. పౌలు అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, అతని మీద చేతులుంచి స్వస్థపరిచాడు.
- ఎపఫ్రొదితు జబ్బుపడి చావుకు దగ్గరగా ఉన్నాడుఫిలిప్పీ 2:25–27
వచనాలు
ఫిలిప్పీ 2:25–27నా సోదరుడు, జతపని వాడు, సాటి యోధుడు, మీ ప్రతినిధి, నాకు అవసరమైనప్పుడు సేవ చేసే వాడు అయిన ఎపఫ్రొదితును మీ దగ్గరికి పంపడం అవసరమనుకున్నాను. అతడు జబ్బు పడ్డాడని మీకు తెలిసింది కాబట్టి అతడు మీ అందరితో ఉండాలని చాలా బెంగగా ఉన్నాడు. అతడు చావుకు దగ్గరగా వెళ్ళాడు, కానీ దేవుడు అతని మీద జాలి చూపించాడు. అతని మీదే కాదు, దుఃఖం వెంట దుఃఖం కలగకుండా నా మీద కూడా జాలి చూపాడు.
- ఒక జబ్బు కారణంగా పౌలు మొదట గలతీయలో సువార్త ప్రకటిస్తాడుగలతీ 4:13–14
వచనాలు
గలతీ 4:13–14మొదటిసారి శరీర బలహీనత కలిగినా నేను మీకు సువార్త ప్రకటించానని మీకు తెలుసు. నా అనారోగ్యం మీకు కష్టం కలిగించినా నన్ను మీరు తృణీకరించ లేదు, నిరాకరించనూ లేదు గాని దేవుని దూతలాగా, క్రీస్తు యేసులాగా నన్ను అంగీకరించారు.
- పౌలు త్రోఫిమును జబ్బుతో మిలేతులో విడిచిపెడతాడు2 తిమో 4:20
వచనాలు
2 తిమో 4:20ఎరస్తు కొరింథులో ఆగిపోయాడు. త్రోఫిముకు జబ్బు చేసింది. అందుకే అతణ్ణి మిలేతులో విడిచి వచ్చాను.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు