Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › అంశాలు › గొడవలు

దైనందిన జీవితం

బైబిల్‌లో గొడవలు

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 32 భాగాలు, వాక్యం వాక్యంగా.

ఉదాహరణలు

  • అబ్రాము, లోతుల పశువుల కాపరులు గొడవపడతారు; ఇద్దరూ విడిపోతారుఆది 13:7–9
    వచనాలు
    ఆది 13:7–9ఆ సమయంలో అబ్రాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు వివాదం ఏర్పడింది. ఆ కాలంలో కనానీయులు, పెరిజ్జీయులు ఆ ప్రదేశంలో కాపురం ఉన్నారు. కాబట్టి అబ్రాము “మనం బంధువులం కాబట్టి నాకూ నీకూ నా పశువుల కాపరులకూ నీ పశువుల కాపరులకూ ఘర్షణ ఉండకూడదు. ఈ ప్రదేశం అంతా నీ ముందు కనిపిస్తూ ఉంది కదా. దయచేసి నన్ను విడిచిపెట్టి వేరుగా ఉండు. నువ్వు ఎడమవైపు వెళ్తే నేను కుడివైపుకు, నువ్వు కుడివైపుకు వెళ్తే నేను ఎడమవైపుకు వెళ్తాను” అని లోతుకు చెప్పాడు.
  • అబీమెలెకు సేవకులు ఆక్రమించిన బావి గురించి అబ్రాహాము ఫిర్యాదు చేస్తాడుఆది 21:25
    వచనాలు
    ఆది 21:25అబీమెలెకు దాసులు దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్న అబ్రాహాముకు చెందిన నీటి బావిని గూర్చి అబ్రాహాము తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. దానికి అబీమెలెకు “ఈ పని ఎవరు చేశారో నాకు తెలియదు.
  • ఇద్దరు హెబ్రీయులు పోట్లాడుకోవడం మోషే చూస్తాడునిర్గ 2:13, అపొ.కా 7:26
    వచనాలు
    నిర్గ 2:13తరువాతి రోజు మోషే అటుగా వెళ్తుంటే అక్కడ ఇద్దరు హెబ్రీయులు గొడవ పడుతున్నారు.
    అపొ.కా 7:26“ఆ తరువాత రోజు ఇద్దరు పోట్లాడుకుంటుంటే అతడు వారిని చూసి, ‘అయ్యలారా, మీరు సోదరులు. మీరెందుకు ఒకరికొకరు అన్యాయం చేసుకుంటున్నారు’ అని వారికి సర్ది చెప్పాలని చూశాడు.
  • ప్రజల వివాదాలన్నిటినీ మోషే ఒక్కడే భరించలేడుద్వితీ 1:12
    వచనాలు
    ద్వితీ 1:12నేనొక్కడినే మీ కష్టాన్ని, భారాన్ని, మీ వివాదాలను ఎలా తీర్చగలను?
  • ఎఫ్రాయిము యెఫ్తాను బెదిరిస్తుంది; యొర్దాను రేవుల దగ్గర “షిబ్బోలెత్”న్యాయా 12:1–6
    వచనాలు
    న్యాయా 12:1–6ఎఫ్రాయిమీయులు సమకూడి “నువ్వు ఉత్తరదిక్కుకు వెళ్లి అమ్మోనీయులతో యుద్ధం చెయ్యడానికి బయలుదేరినప్పుడు నీతో కలిసి వెళ్ళడానికి మమ్మల్ని ఎందుకు పిలవలేదు? నువ్వు కాపురముంటున్న నీ ఇంటిని అగ్నితో కాల్చేస్తాం” అని యెఫ్తాతో అన్నారు. యెఫ్తా “నాకు, నా ప్రజలకు అమ్మోనీయులతో పెద్ద కలహం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని పిలిచాను గాని మీరు వాళ్ళ చేతుల్లోనుంచి నన్ను రక్షించలేదు. మీరు నన్ను రక్షించకపోవడం చూసి నా ప్రాణం అరచేతిలో పెట్టుకుని అమ్మోనీయులతో యుద్ధం చెయ్యడానికి వెళ్ళాను. అప్పుడు యెహోవా నాకు వాళ్ళ మీద జయం ఇచ్చాడు. అయితే నాతో పోట్లాడటానికి ఈ రోజు మీరెందుకు వచ్చారు?” అన్నాడు. అప్పుడు యెఫ్తా గిలాదు వారందర్నీ పోగు చేసుకుని ఎఫ్రాయిమీయులతో యుద్ధం చేశాడు. గిలాదువాళ్ళు ఎఫ్రాయిమీయుల మీద దాడి చేశారు. ఎందుకంటే వాళ్ళు “ఎఫ్రాయిమీయులకు మనష్శే గోత్రికులకు మధ్య గిలాదువారైన మీరు-ఎఫ్రాయిమీయులకు మొహం చాటేసి పారిపోయారు” అన్నారు. ఎఫ్రాయిమీయులతో యుద్ధం చెయ్యడానికి గిలాదువాళ్ళు యొర్దాను దాటే రేవులను పట్టుకొన్నప్పుడు, పారిపోతున్న ఎఫ్రాయిమీయుల్లో ఎవరన్నా “నన్ను దాటనివ్వండి” అని అడిగితే గిలాదువాళ్ళు “నువ్వు ఎఫ్రాయిమీయుడవా” అని అతన్ని అడిగారు. అందుకతను “కాదు” అంటే, వాళ్ళు అతన్ని చూసి “షిబ్బోలెత్” అనే మాట పలకమన్నారు. అతడు పలకలేక “సిబ్బోలెత్” అని పలికితే, వాళ్ళు అతన్ని పట్టుకుని యొర్దాను రేవుల దగ్గర చంపేశారు. ఆ సమయంలో ఎఫ్రాయిమీయుల్లో నలభై రెండు వేల మంది చనిపోయారు.
  • తెకోవ స్త్రీ కథ: పొలంలో ఇద్దరు కుమారులు కొట్లాడుకుంటారు2 సమూ 14:6
    వచనాలు
    2 సమూ 14:6నీ దాసిని, నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారు పొలంలో వాదులాడుకుని కొట్టుకున్నారు. వారిని విడదీసేవారు ఎవ్వరూ లేకపోవడంతో వారిలో ఒకడు రెండవవాణ్ణి కొట్టి చంపాడు.
  • తమలో ఎవరు గొప్ప అని శిష్యులు వాదించుకుంటారుమార్కు 9:33–34, లూకా 22:24
    వచనాలు
    మార్కు 9:33–34వారు కపెర్నహూము చేరారు. అందరూ ఇంట్లో చేరాక యేసు వారితో, “దారిలో మీరు దేని గురించి చర్చించుకుంటున్నారు?” అని అడిగాడు. అందరూ మౌనంగా ఉండిపోయారు. ఎందుకంటే దారిలో వారు తమలో ఎవరు గొప్ప, అని వాదించుకున్నారు.
    లూకా 22:24తమలో ఎవరు గొప్ప అనే వివాదం వారిలో తలెత్తింది.
  • సున్నతి గురించి అంతియొకయలో తీవ్రమైన వాదంఅపొ.కా 15:1–2
    వచనాలు
    అపొ.కా 15:1–2యూదయ నుండి కొందరు వచ్చి, “మోషే నియమించిన విశ్వాసులకు సున్నతి పొందితేనే గాని మీకు రక్షణ లేదు” అని విశ్వాసులకు బోధిస్తూ ఉన్నారు. పౌలుకు, బర్నబాకు వారితో తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయి. ఈ సమస్య గురించి పౌలు బర్నబాలు, ఇంకా మరి కొంతమంది యెరూషలేములోని అపొస్తలుల, పెద్దల దగ్గరికి వెళ్ళాలని సోదరులు నిశ్చయించారు.
  • మార్కు విషయంలో పౌలు, బర్నబా విడిపోతారుఅపొ.కా 15:37–39
    వచనాలు
    అపొ.కా 15:37–39అప్పుడు మార్కు అనే పేరున్న యోహానును వెంటబెట్టుకుని వెళ్ళడానికి బర్నబా ఇష్టపడ్డాడు. అయితే పౌలు పంఫులియలో పరిచర్యకు తమతో రాకుండా విడిచి వెళ్ళిపోయిన వాణ్ణి వెంటబెట్టుకుని పోవడం భావ్యం కాదని తలంచాడు. ఇద్దరి మధ్య తీవ్రమైన భేదాభిప్రాయం రావడంతో వారు ఒకరి నొకరు విడిచి వేరైపోయారు. బర్నబా, మార్కును వెంటబెట్టుకుని ఓడ ఎక్కి సైప్రస్ వెళ్ళాడు.
  • పునరుత్థానం గురించి పరిసయ్యులూ సద్దూకయ్యులూ గొడవపడతారుఅపొ.కా 23:7–10
    వచనాలు
    అపొ.కా 23:7–10అతడా విధంగా చెప్పినప్పుడు పరిసయ్యులకు సద్దూకయ్యులకు మధ్య కలహం రేగింది. అందువల్ల ఆ సమూహం రెండు పక్షాలుగా చీలిపోయింది. సద్దూకయ్యులు పునరుత్థానం లేదనీ, దేవదూత గానీ, ఆత్మగానీ లేదనీ చెబుతారు. కాని పరిసయ్యులు ఇవన్నీ ఉన్నాయంటారు. అప్పుడు పెద్ద గోల పుట్టింది. పరిసయ్యుల పక్షంగా ఉన్న శాస్త్రుల్లో కొందరు లేచి, “ఈ మనిషిలో ఏ దోషమూ మాకు కనబడలేదు. బహుశా ఒక ఆత్మగానీ, దేవదూతగానీ అతనితో మాట్లాడాడేమో” అని వాదించారు. కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేస్తారేమో అని సహస్రాధిపతి భయపడి, “వారి మధ్య నుండి అతణ్ణి బలవంతంగా పట్టుకుని కోటలోకి తీసుకుని రండి” అని సైనికులకు ఆజ్ఞాపించాడు.
  • అంతియొకయలో పౌలు కేఫాను ముఖాముఖిగా ఎదిరిస్తాడుగలతీ 2:11
    వచనాలు
    గలతీ 2:11అయితే కేఫా, అంతియొకయకు వచ్చినప్పుడు అతడు తప్పు చేశాడు. కాబట్టి నేను ముఖాముఖిగా అతన్ని నిలదీశాను.
  • కొరింథీయులు: “నేను పౌలు వాణ్ణి,” “నేను అపొల్లో వాణ్ణి”1 కొరింతీ 1:11–12
    వచనాలు
    1 కొరింతీ 1:11–12సోదరులారా, మీలో కలహాలు ఉన్నాయని క్లోయె ఇంటివారి ద్వారా తెలిసింది. మీలో ఒకడు ‘నేను పౌలు వాణ్ణి,’ ఒకడు ‘నేను అపొల్లో వాణ్ణి,’ మరొకడు ‘నేను కేఫా వాణ్ణి,’ ఇంకొకడు ‘నేను క్రీస్తు వాణ్ణి’ అని చెప్పుకుంటున్నారని నేను విన్నాను.
  • విశ్వాసులు ఒకరిపై ఒకరు న్యాయస్థానానికి వెళ్తారు1 కొరింతీ 6:6–7
    వచనాలు
    1 కొరింతీ 6:6–7అయితే ఒక సోదరుడు మరొక సోదరుని మీద వ్యాజ్యెమాడుతున్నాడు. అది కూడా అవిశ్వాసి అయిన న్యాయాధికారి ఎదుట! అసలు క్రైస్తవుల మధ్య ఒకరితో ఒకరికి వివాదం ఉండడమే మీ అపజయం. దాని కంటే మీరు అన్యాయం సహించడం మంచిది కదా? దానికంటే మీ వస్తువులు పోగొట్టుకోవడం మంచిది కదా?
  • యువొదియ, సుంటుకే ఏకమనస్సుతో ఉండాలని పౌలు బతిమాలుతాడుఫిలిప్పీ 4:2
    వచనాలు
    ఫిలిప్పీ 4:2ప్రభువులో మనసు కలిసి ఉండమని యువొదియను, సుంటుకేను బ్రతిమాలుతున్నాను.

ధర్మశాస్త్రంలో

  • కొట్లాటలో గాయపడినవానికి పోయిన పనికీ వైద్యానికీ చెల్లించాలినిర్గ 21:18–19
    వచనాలు
    నిర్గ 21:18–19ఎవరి మధ్యనైనా గొడవ జరిగినప్పుడు ఒకడు మరొకడిని రాయితో కొట్టి గానీ, పిడికిలితో గుద్దిగానీ చనిపోకుండా మంచాన పడేలా చేస్తే, తరువాత గాయపడ్డవాడు లేచి తన చేతికర్ర సాయంతో తిరుగుతుంటే అతణ్ణి కొట్టిన వాడికి శిక్ష ఏమీ ఉండదు. అయితే గాయపడిన వ్యక్తి పని చేయలేకపోయిన కాలానికి సరిపడ్డ సొమ్ము కొట్టినవాడు ఇచ్చి, అతణ్ణి పూర్తిగా బాగుచేయించాలి.
  • మనుషుల మధ్య వివాదాన్ని తీర్పు కోసం న్యాయస్థానానికి తీసుకువెళ్తారుద్వితీ 25:1
    వచనాలు
    ద్వితీ 25:1“ప్రజలు తమ వివాదాల పరిష్కారానికి న్యాయస్థానానికి వస్తే న్యాయమూర్తులు వారికి తీర్పు చెప్పాలి. నీతిమంతుణ్ణి విడిపించి నేరస్తులను శిక్షించాలి.

సామెతల్లోని మాటలు

  • ద్వేషం కలహాలు రేపుతుంది; ప్రేమ తప్పులన్నిటినీ కప్పుతుందిసామె 10:12
    వచనాలు
    సామె 10:12ప్రేమ దోషాలన్నిటినీ కప్పి ఉంచుతుంది. పగ తగాదాలను రేకెత్తిస్తుంది.
  • కోపిష్ఠి కలహం రేపుతాడుసామె 15:18, సామె 29:22
    వచనాలు
    సామె 15:18ముక్కోపి కలహాలు రేపుతాడు. ఓర్పు గలవాడు వివాదాలు శాంతింపజేస్తాడు.
    సామె 29:22కోపిష్టి కలహం రేపుతాడు. ముక్కోపి చాలా పాపాలు చేస్తాడు.
  • కలహంతో కూడిన విందు కంటే నెమ్మదితో పొడి రొట్టె ముక్క మేలుసామె 17:1
    వచనాలు
    సామె 17:1ఎంత రుచికరమైన భోజనం ఉన్నా కలహాలతో ఉన్న ఇంట్లో ఉండడం కంటే ప్రశాంతంగా వట్టి రొట్టెముక్క తినడం మంచిది.
  • గొడవ మొదలుపెట్టడం వరదను విడిచిపెట్టడం లాంటిదిసామె 17:14
    వచనాలు
    సామె 17:14పోట్లాట మొదలు పెట్టడం నీటిని వదిలిపెట్టినట్టే. కాబట్టి వివాదం పెరగక ముందే దాన్ని వదిలెయ్యి.
  • వివాదాన్ని పరిష్కరించడం గౌరవం; ప్రతి బుద్ధిహీనుడూ గొడవపడతాడుసామె 20:3
    వచనాలు
    సామె 20:3కలహానికి దూరంగా ఉండడం మనిషికి గౌరవం. మూర్ఖుడు కావాలని వాదం పెట్టుకుంటాడు.
  • ఎగతాళి చేసేవాణ్ణి వెళ్ళగొట్టు, గొడవలు ఆగిపోతాయిసామె 22:10
    వచనాలు
    సామె 22:10తిరస్కారబుద్ధి గలవాణ్ణి వెళ్ళగొట్టు. కలహాలు, పోరాటాలు, అవమానాలు వాటంతట అవే సద్దు మణుగుతాయి.
  • ఇతరుల గొడవలో జోక్యం చేసుకోవడం కుక్క చెవులు పట్టుకోవడం లాంటిదిసామె 26:17
    వచనాలు
    సామె 26:17తనకు సంబంధంలేని పోట్లాటలో తల దూర్చేవాడు. దారినపోయే కుక్క చెవులు పట్టుకొనే వాడితో సమానం.
  • గొడవపడే భార్య వర్షపు రోజు ఎడతెగకుండా పడే బిందువుల్లాంటిదిసామె 27:15, సామె 25:24
    వచనాలు
    సామె 27:15ముసురు పట్టిన రోజున ఏక ధారగా కురుస్తూ ఉండే నీళ్లు, గయ్యాళి ఇల్లాలు ఒకటే.
    సామె 25:24గయ్యాళితో పెద్ద భవంతిలో ఉండడం కంటే మిద్దెమీద ఒక మూలన ఉండడమే హాయి.

ఇతర చోట్ల

  • న్యాయస్థానానికి వెళ్ళే దారిలోనే నీ ప్రత్యర్థితో త్వరగా రాజీపడుమత్తయి 5:25
    వచనాలు
    మత్తయి 5:25నీపై నేరం ఆరోపించేవాడితో న్యాయస్థానానికి వెళ్ళే దారిలోనే త్వరగా రాజీపడు. లేకపోతే అతడు నిన్ను న్యాయాధిపతికి అప్పగిస్తాడేమో. ఆ న్యాయాధిపతి నిన్ను అధికారికి అప్పగించి చెరసాల్లో వేయిస్తాడేమో.
  • సాధ్యమైతే అందరితో సమాధానంగా జీవించండిరోమా 12:18
    వచనాలు
    రోమా 12:18మీ చేతనైనంత మట్టుకు అందరితో సమాధానంగా ఉండండి.
  • అవివేకపు చర్చలు గొడవలు పుట్టిస్తాయి2 తిమో 2:23–24
    వచనాలు
    2 తిమో 2:23–24బుద్ధిహీనమైన, మూఢత్వంతో కూడిన తర్కాలు జగడాలకు కారణమౌతాయని గ్రహించి వాటిని వదిలెయ్యి. ప్రభువు సేవకుడు పోట్లాటలకు దిగకూడదు. అందరి మీదా దయ చూపాలి. బోధనా సామర్ధ్యం కలిగి, సహించేవాడై ఉండాలి.
  • “మీలో తగాదాలూ, అభిప్రాయభేదాలూ ఎక్కడ నుండి వస్తున్నాయి?”యాకో 4:1
    వచనాలు
    యాకో 4:1మీలో తగాదాలూ, అభిప్రాయభేదాలూ ఎక్కడ నుండి వస్తున్నాయి? మీ సాటి విశ్వాసుల్లో వివాదాలకు కారణమైన మీ శరీర సంబంధమైన కోరికల నుంచే కదా?

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు