Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › అంశాలు › గుడారాలు

దైనందిన జీవితం

బైబిల్‌లో గుడారాలు

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 29 భాగాలు, వాక్యం వాక్యంగా.

  • గుడారాల్లో నివసిస్తూ పశువులను పెంచేవారికి యాబాలు మూలపురుషుడుఆది 4:20
    వచనాలు
    ఆది 4:20ఆదా యాబాలుకు జన్మనిచ్చింది. అతడు పశువులు పెంపకం చేస్తూ గుడారాల్లో నివాసం ఉండేవాళ్లకు మూలపురుషుడు.
  • అబ్రాము బేతేలుకూ హాయికీ మధ్య గుడారం వేసి, తర్వాత మమ్రేకు వెళ్తాడుఆది 12:8, ఆది 13:18
    వచనాలు
    ఆది 12:8అతడు అక్కడనుంచి బయలుదేరి బేతేలుకు తూర్పువైపు ఉన్న కొండ దగ్గరికి వచ్చాడు. పడమర వైపు ఉన్న బేతేలుకు, తూర్పున ఉన్న హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు హోమబలి అర్పించి, యెహోవా పేరట ప్రార్థన చేశాడు.
    ఆది 13:18అప్పుడు అబ్రాము తన గుడారం తీసి, హెబ్రోనులో ఉన్న మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షాల దగ్గర వేసుకుని అక్కడ నివసించాడు. అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాడు.
  • లోతుకు కూడా మందలూ పశువులూ గుడారాలూ ఉన్నాయిఆది 13:5
    వచనాలు
    ఆది 13:5అబ్రాముతో పాటు కలసి వెళ్ళిన లోతుకు కూడా గొర్రెలు, పశువులు, పరివారం ఉన్నాయి.
  • మండుటెండలో అబ్రాహాము తన గుడారం ద్వారం దగ్గర కూర్చున్నాడుఆది 18:1–2
    వచనాలు
    ఆది 18:1–2మమ్రే అనే ప్రాంతంలో సింధూర చెట్ల దగ్గర ఒక మధ్యాహ్నం వేళ అబ్రాహాము తన గుడారం వాకిట్లో కూర్చుని ఉన్నాడు. అప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. అతడు తలెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ముందు నిలబడి ఉన్నారు. అతడు వారిని చూసి తన గుడారం వదిలి వారిని కలుసుకోవడానికి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. వారి ఎదుట నేల వరకూ వంగి ఇలా అన్నాడు.
  • శారా గుడారం ద్వారం దగ్గర వింటుందిఆది 18:9–10
    వచనాలు
    ఆది 18:9–10వారు అతణ్ణి “నీ భార్య ఎక్కడ?” అని అడిగారు. అతడు “అదిగో, గుడారంలో ఉంది” అన్నాడు. అప్పుడు ఆయన “తిరిగి వసంతకాలంలో నేను మళ్ళీ నీ దగ్గరికి తప్పకుండా వస్తాను. విను, అప్పటికి నీ భార్య శారాకు ఒక కొడుకు ఉంటాడు” అన్నాడు. శారా ఆయన వెనుక ఉన్న గుడారం ద్వారం దగ్గర ఉండి ఈ మాటలు వింటూ ఉంది.
  • ఇస్సాకు రిబ్కాను తన తల్లి శారా గుడారంలోకి తీసుకువెళ్తాడుఆది 24:67
    వచనాలు
    ఆది 24:67అప్పుడు ఇస్సాకు తన తల్లి అయిన శారా గుడారం లోకి ఆమెను తీసుకు వెళ్ళాడు. అలా అతడు రిబ్కాను తన భార్యగా స్వీకరించాడు. అతడు ఆమెను ప్రేమించాడు. అప్పుడు ఇస్సాకు తన తల్లి మరణం విషయమై ఆదరణ పొందాడు.
  • ఇస్సాకు గుడారం వేస్తాడు; అతని సేవకులు బావి తవ్వుతారుఆది 26:25
    వచనాలు
    ఆది 26:25ఇస్సాకు అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. అక్కడ యెహోవా పేరుమీద ప్రార్థన చేసి అక్కడే తన గుడారం వేసుకున్నాడు. ఇస్సాకు దాసులు అక్కడ ఒక బావి తవ్వారు.
  • యాకోబుకూ లేయాకూ రాహేలుకూ దాసీలకూ ఒక్కొక్కరికీ ఒక గుడారంఆది 31:33
    వచనాలు
    ఆది 31:33లాబాను యాకోబు గుడారంలోకీ లేయా గుడారంలోకీ ఇద్దరు దాసీల గుడారాల్లోకీ వెళ్ళాడు గాని అతనికేమీ దొరకలేదు. తరువాత అతడు లేయా గుడారంలో నుండి రాహేలు గుడారంలోకి వెళ్ళాడు.
  • అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు గుడారాల్లో నివసించారుహెబ్రీ 11:9
    వచనాలు
    హెబ్రీ 11:9విశ్వాసాన్ని బట్టి అతడు వాగ్దాన భూమిలో పరదేశిగా నివసించాడు. అతడు తనతోబాటు అదే వాగ్దానానికి వారసులైన ఇస్సాకు, యాకోబు అనే వారితో గుడారాల్లో నివసించాడు.
  • గుడారాలకు తెరలు, తాళ్ళు, మేకులు ఉండేవియెష 54:2, యిర్మీ 10:20
    వచనాలు
    యెష 54:2నీ డేరా పెద్దదిగా చెయ్యి. నీ డేరా తెరలను ఇంకా పొడిగించు. నీ తాళ్ళు పొడుగు చెయ్యి. నీ మేకులు దిగ్గొట్టు.
    యిర్మీ 10:20నా గుడారం చిందర వందర అయ్యింది. నా డేరా తాళ్ళు అన్నీ తెగిపోయాయి. వారు నా పిల్లలను తీసుకెళ్ళిపోయారు. అందుకే వారు లేరు. నా డేరా నిలబెట్టడానికి, వాటి తెరలు వేయడానికి నా దగ్గర ఎవరూ లేరు.
  • కేదారు గుడారాల్లా నల్లగాపరమ 1:5
    వచనాలు
    పరమ 1:5యెరూషలేము ఆడపడుచులారా, నేను నల్లటి పిల్లనే కానీ అందగత్తెను. కేదారు డేరాల్లాగా, సొలొమోను రాజభవనం తెరల్లాగా నేను అందగత్తెను.
  • పౌలు, అకుల, ప్రిస్కిల్ల వృత్తిరీత్యా గుడారాలు కుట్టేవారుఅపొ.కా 18:2–3
    వచనాలు
    అపొ.కా 18:2–3పొంతు వంశానికి చెందిన అకుల అనే ఒక యూదుడినీ అతని భార్య ప్రిస్కిల్లనూ కనుగొన్నాడు. యూదులంతా రోమ్ నగరాన్ని విడిచి వెళ్ళాలని క్లాడియస్ చక్రవర్తి కొద్ది కాలం క్రితమే ఆజ్ఞ జారీ చేసిన కారణం చేత, వారు ఇటలీ నుంచి కొద్ది కాలం క్రితమే ఈ పట్టణానికి తరలి వచ్చారు. వారి వృత్తి డేరాలు కుట్టడం. పౌలు వృత్తి కూడా అదే కాబట్టి అతడు వారితో నివసిస్తూ కలిసి పని చేశాడు.

అరణ్యంలో

  • మోషే తన మామను పలకరిస్తాడు; వారు గుడారంలోకి వెళ్తారునిర్గ 18:7
    వచనాలు
    నిర్గ 18:7మోషే తన మామకు ఎదురు వెళ్ళాడు. అతనికి వందనం చేసి ముద్దు పెట్టుకున్నాడు. ఒకరినొకరు యోగక్షేమాలు తెలుసుకుని గుడారంలోకి వచ్చారు.
  • ఇశ్రాయేలు విభాగాల వారీగా, ప్రతివాడూ తన ధ్వజం కింద దిగుతుందిసంఖ్యా 1:52, సంఖ్యా 2:2
    వచనాలు
    సంఖ్యా 1:52ఇశ్రాయేలు ప్రజలు వారి వారి సైనిక దళానికి చెందిన జెండా ఎక్కడ నాటారో అక్కడే తమ గుడారాలు వేసుకోవాలి.
    సంఖ్యా 2:2“ఇశ్రాయేలు ప్రజల్లో ప్రతి ఒక్కరూ సైన్యంలో తమ దళానికి చెందిన పతాకం చుట్టూ, తన గోత్రాన్ని సూచించే చిన్నజెండా చుట్టూ తమ గుడారాలు వేసుకోవాలి. సన్నిధి గుడారానికి అభిముఖంగా వారి గుడారాలు ఉండాలి.
  • ప్రజలు తమ గుడారాల ద్వారాల దగ్గర నిలబడి మోషేను చూస్తారునిర్గ 33:8
    వచనాలు
    నిర్గ 33:8మోషే ఆ గుడారానికి వెళ్తూ ఉన్నప్పుడల్లా తమ గుడారాల్లో ఉన్న ప్రజలు లేచి నిలబడి అతడు గుడారం లోకి వెళ్ళేదాకా అతని వైపు నిదానంగా చూస్తూ ఉండేవాళ్ళు.
  • బిలాము: “యాకోబూ, నీ గుడారాలు ఎంతో అందంగా ఉన్నాయి”సంఖ్యా 24:5
    వచనాలు
    సంఖ్యా 24:5యాకోబూ, నీ గుడారాలు ఎంతో అందంగా ఉన్నాయి. ఇశ్రాయేలూ, నీ నివాసస్థలాలు ఎంత రమ్యంగా ఉన్నాయి!
  • ఆకాను తన గుడారం లోపల నేలలో వెండి బంగారాలు దాచిపెడతాడుయెహో 7:21–22
    వచనాలు
    యెహో 7:21–22దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రాన్నీ, రెండువందల తులాల వెండినీ, యాభై తులాల బరువైన ఒక బంగారు కమ్మీనీ చూసి ఆశపడి వాటిని తీసుకున్నాను. అదిగో, వాటిని నా డేరా మధ్య నేలలో పాతిపెట్టాను. ఆ వెండి కూడా దాని కింద ఉంది” అని తాను చేసిన దాన్ని ఒప్పుకున్నాడు. అప్పుడు యెహోషువ దూతలను పంపినప్పుడు వారు అతని డేరా దగ్గరికి పరుగెత్తి చూశారు. వారు ఆ వస్తువులనూ వాటి కింద ఆ వెండినీ కనుక్కున్నారు.

కథల్లో

  • యాయేలు తన గుడారంలో సీసెరాకు పాలిచ్చి, గుడారపు మేకుతో అతణ్ణి చంపుతుందిన్యాయా 4:18–21, న్యాయా 5:25–26
    వచనాలు
    న్యాయా 4:18–21అప్పుడు యాయేలు సీసెరాను ఎదుర్కొని అతణ్ణి చూసి “ప్రభూ, ఇటు నా వైపుకి రండి, భయపడవద్దు” అని చెప్పింది. అప్పుడు అతడు ఆమె గుడారంలోకి వెళ్ళాడు. అప్పుడు ఆమె అతనిపై దుప్పటి కప్పింది. అతడు “దాహంగా ఉంది, దయచేసి నాకు కొంచెం నీళ్ళు ఇవ్వు” అని అడిగాడు. ఆమె తోలుతో చేసిన తిత్తి విప్పి అతనికి దాహానికి ఇచ్చి, అతనికి మళ్ళీ దుప్పటి కప్పే సమయంలో అతడు “గుడారం ద్వారం దగ్గర నుండి ఎవరైనా లోపలికి వచ్చి, లోపల ఎవరైనా ఉన్నారా అని అడిగితే, ఎవరూ లేరని నువ్వు చెప్పాలి” అన్నాడు. ఆ తరువాత హెబెరు భార్య యాయేలు గుడారానికి కొట్టే మేకు తీసుకుని ఒక సుత్తె చేత్తో పట్టుకుని మెల్లగా అతని దగ్గరికి వచ్చి, అలసిపోయి గాఢనిద్రలో ఉన్న అతని కణతలో ఆ మేకు దిగగొట్టగా అది అతని తలలో గుండా నేలలోకి దిగింది.
    న్యాయా 5:25–26అతడు దాహానికి నీళ్ళు అడిగాడు. ఆమె పాలు తెచ్చి ఇచ్చింది. సైన్యాధిపతులకు తగిన పాత్రతో వెన్న తెచ్చి ఇచ్చింది. ఆమె తన చేతితో గుడారపు మేకు పట్టుకుంది. పనివాని సుత్తెను కుడిచేత్తో పట్టుకుని సీసెరాను కొట్టింది. ఆమె అతని తల పగలగొట్టింది. ఆమె అతని తల ప్రక్కన సుత్తెతో కొడితే అతని తల బద్దలైంది.
  • మిద్యానీయులు తమ పశువులతో, గుడారాలతో మిడతల దండులా వస్తారున్యాయా 6:5
    వచనాలు
    న్యాయా 6:5వాళ్ళ ఒంటెలు లెక్కకు మించి ఉన్నాయి.
  • దావీదు గొల్యాతు ఆయుధాలను తన సొంత గుడారంలో ఉంచుతాడు1 సమూ 17:54
    వచనాలు
    1 సమూ 17:54అయితే దావీదు ఆ ఫిలిష్తీయుని ఆయుధాలను తన డేరాలో ఉంచుకుని, అతని తలను తీసుకు యెరూషలేముకు వచ్చాడు.
  • ఊరియా: మందసం, ఇశ్రాయేలు, యూదా గుడారాల్లో ఉన్నాయి2 సమూ 11:11
    వచనాలు
    2 సమూ 11:11అందుకు ఊరియా “మందసమూ, ఇశ్రాయేలువారూ యూదావారూ గుడారాల్లో ఉంటున్నారు. నా అధికారి యోవాబూ, మా రాజువైన నీ సేవకులూ బాహ్య ప్రదేశంలో ఉండగా నేను తింటూ, తాగుతూ నా భార్యతో గడపడానికి ఇంటికి వెళ్ళాలా? నీ మీద, నీ ప్రాణం మీద ఒట్టు, నేను అలా ఎంత మాత్రం చేయలేను” అని దావీదుతో అన్నాడు.
  • ఇశ్రాయేలు ప్రజలారా, మీ మీ సొంత స్థలాలకు వెళ్ళిపొండి2 సమూ 20:1, 1 రాజులు 12:16
    వచనాలు
    2 సమూ 20:1బెన్యామీను గోత్రానికి చెందిన బిక్రి కొడుకు షెబ అనే పనికిమాలినవాడు ఒకడున్నాడు. వాడు “ఇశ్రాయేలు ప్రజలారా, మీరంతా మీ మీ సొంత స్థలాలకు వెళ్ళిపొండి. దావీదులో మనకు పాలు లేదు, యెష్షయి కుమారుడిలో మనకు వాటా ఎంతమాత్రమూ రాదు” అంటూ బాకా ఊది గట్టిగా ప్రకటించాడు.
    1 రాజులు 12:16కాబట్టి ఇశ్రాయేలు వారంతా రాజు తమ విన్నపం వినలేదని తెలుసుకుని రాజుకిలా బదులిచ్చారు: “దావీదు వంశంతో మాకేం సంబంధం? యెష్షయి కొడుకుతో మాకు వారసత్వం ఏముంది? ఇశ్రాయేలు ప్రజలారా, మీ మీ గుడారాలకు వెళ్ళండి. దావీదు వంశమా, నీ వంశం సంగతి నువ్వే చూసుకో.” ఇలా చెప్పి ఇశ్రాయేలువారు తమ గుడారాలకు వెళ్లిపోయారు.
  • ఆసా సైన్యం పశువుల కాపరుల గుడారాలపై దాడి చేసి గొర్రెలనూ ఒంటెలనూ తీసుకుంటుంది2 దిన 14:15
    వచనాలు
    2 దిన 14:15అక్కడి పశువుల శాలలను పడగొట్టి, విస్తారమైన గొర్రెలనూ ఒంటెలనూ సమకూర్చుకుని యెరూషలేముకు తిరిగి వచ్చారు.
  • కాపరి గుడారాన్ని పెకలించి తరలిస్తారుయెష 38:12
    వచనాలు
    యెష 38:12నా జీవం తీసేశారు. గొర్రెల కాపరి గుడిసెలాగా అది నా దగ్గర నుండి తీసివేశారు. నేతపనివాడు చేసినట్టు నా జీవితాన్ని చుట్టేస్తున్నాను. ఆయన నన్ను మగ్గం నుండి దూరం చేశాడు. ఒక్క రోజులోనే నువ్వు నా జీవితాన్ని ముగిస్తున్నావు.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు