Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › అంశాలు › వ్యవసాయం

దైనందిన జీవితం

బైబిల్‌లో వ్యవసాయం

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 37 భాగాలు, వాక్యం వాక్యంగా.

  • సాగుచేయడానికీ కాపాడడానికీ మనిషిని ఏదెనులో ఉంచుతారుఆది 2:15
    వచనాలు
    ఆది 2:15దేవుడైన యెహోవా ఏదెను తోట సాగు చెయ్యడానికీ దాన్ని చూసుకోడానికీ మనిషిని అక్కడ పెట్టాడు.
  • కయీను భూమిని సాగుచేసేవాడు; హేబెలు గొర్రెల కాపరిఆది 4:2
    వచనాలు
    ఆది 4:2తరువాత ఆమె అతని తమ్ముడు హేబెలుకు జన్మనిచ్చింది. హేబెలు గొర్రెల కాపరి. కయీను వ్యవసాయం చేసేవాడు.
  • వ్యవసాయదారుడైన నోవహు ద్రాక్షతోట నాటుతాడుఆది 9:20
    వచనాలు
    ఆది 9:20నోవహు భూమిని సాగుచేయడం ప్రారంభించి, ద్రాక్షతోట వేశాడు.
  • ఆ సంవత్సరం ఇస్సాకు విత్తి నూరంతలు పంట కోస్తాడుఆది 26:12
    వచనాలు
    ఆది 26:12ఇస్సాకు ఆ దేశంలో నివసించి వ్యవసాయం చేసాడు. ఆ సంవత్సరం యెహోవా ఆశీర్వదించడం వల్ల నూరంతలు అధిక పంటను కోయగలిగాడు.
  • రూతు కోతగాళ్ళ వెనుక పరిగె ఏరుకుంటుంది: సుమారు ఒక తూము బార్లీరూతు 2:2–3, రూతు 2:17
    వచనాలు
    రూతు 2:2–3మోయాబీ స్త్రీ రూతు నయోమితో ఇలా అంది “నువ్వు వెళ్ళమంటే నేను పొలాల్లోకి వెళ్ళి పరిగె ఏరుకుంటాను. నాపై ఎవరు దయ చూపిస్తారో వారి వెనకే వెళ్ళి పరిగె ఏరుకుంటాను.” అప్పుడు నయోమి “అలాగే అమ్మా, వెళ్ళు” అంది. ఆమె పనికి వెళ్ళింది. పంట కోసేవారి పని అయ్యాక వెళ్ళి నేలపై రాలిన పరిగె ఏరుకుంది. ఆమె పరిగె ఏరుకునే ఆ పొలం ఎలీమెలెకు వంశం వాడైన బోయజుది.
    రూతు 2:17కాబట్టి ఆమె సాయంకాలం వరకూ అదే పొలంలో ఏరుకుని తాను ఏరుకున్న వాటిని దుళ్ళగొట్టింది. అవి దాదాపు తూమెడు బార్లీ గింజలు అయ్యాయి.
  • బోయజు రాత్రి కళ్ళం మీద బార్లీ తూర్పారబడతాడురూతు 3:2
    వచనాలు
    రూతు 3:2ఎవరి పనికత్తెల దగ్గర నువ్వు ఉన్నావో ఆ బోయజు మనకు బంధువు. విను, ఈ రాత్రి అతడు తన పొలంలో బార్లీ గింజలు తూర్పారబట్టబోతున్నాడు.
  • మిద్యాను నుంచి దాచడానికి గిద్యోను ద్రాక్ష తొట్టిలో గోధుమలు దుళ్ళగొడతాడున్యాయా 6:11
    వచనాలు
    న్యాయా 6:11అప్పుడు యెహోవా దూత వచ్చి ఒఫ్రాలో అబీయెజ్రీయుడైన యోవాషుకు చెందిన మస్తకి చెట్టు కింద కూర్చున్నాడు. యోవాషు కొడుకు గిద్యోను మిద్యానీయుల కంటబడకుండా గానుగ చాటున గోదుమలు దుళ్లగొడుతూ ఉన్నప్పుడు,
  • బేత్షెమెషు ప్రజలు లోయలో గోధుమ కోత కోస్తున్నారు1 సమూ 6:13
    వచనాలు
    1 సమూ 6:13బేత్షెమెషు ప్రజలు పొలంలో తమ గోదుమ పంట కోస్తున్నారు. వారు కన్నులెత్తి చూసినప్పుడు మందసం కనబడింది. దాన్ని చూసి వారు సంతోషించారు.
  • నాగటి నక్కులనూ కొడవళ్ళనూ పదును పెట్టించుకోవడానికి ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్తారు1 సమూ 13:19–21
    వచనాలు
    1 సమూ 13:19–21హెబ్రీయులు తమ కోసం కత్తులు, ఈటెలు తయారు చేయించుకొంటారేమోనని ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల దేశమంతటిలో కమ్మరివాళ్ళు ఎవరూ ఉండకుండాా చేశారు. కాబట్టి ఇశ్రాయేలీయులంతా తమ నాగటి కర్రలు, పారలు, గొడ్డళ్ళు, కొడవళ్ళు పదును పెట్టుకోవడానికి ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది. నాగటి కర్రలకు, పారలకు, మూడు ముళ్ళు ఉండే కొంకీలకు, గొడ్డళ్ళకు పదును పెట్టడానికి ఆకురాయి మాత్రమే వారి దగ్గర ఉంది.
  • ఎలీషా పన్నెండు జతల ఎద్దులతో దున్నుతున్నాడు1 రాజులు 19:19
    వచనాలు
    1 రాజులు 19:19ఏలీయా అక్కడ నుండి వెళ్లిన తరువాత అతనికి షాపాతు కొడుకు ఎలీషా కనిపించాడు. అతడు తన దగ్గరున్న పన్నెండు జతల ఎడ్లతో దుక్కి దున్నిస్తూ పన్నెండవ కాడి తానే తోలుతున్నాడు. ఏలీయా అతని దగ్గరికి వెళ్లి తన పైబట్టను అతని మీద వేశాడు.
  • పొలాలు, ద్రాక్షతోటలు, ఒలీవ చెట్లు, పశువులపై దావీదు అధికారులు1 దిన 27:26–31
    వచనాలు
    1 దిన 27:26–31పొలాల్లో పనిచేసే వాళ్ళ మీద, భూమి దున్నే వాళ్ళ మీద కెలూబు కొడుకు ఎజ్రీ నియామకం జరిగింది. ద్రాక్షతోటల మీద రామాతీయుడైన షిమీ, ద్రాక్షతోటల ఆదాయమైన ద్రాక్షామధురసం నిలువ చేసే కొట్ల మీద షిష్మీయుడైన జబ్ది నియామకం జరిగింది. షెఫేలా ప్రదేశంలో ఉన్న ఒలీవ చెట్ల మీద, మేడిచెట్ల మీద గెదేరీయుడైన బయల్‌ హనాను నియామకం జరిగింది. నూనె కొట్ల మీద యోవాషు నియామకం జరిగింది. షారోనులో మేసే పశువుల మీద షారోనీయుడైన షిట్రయి, లోయల్లో ఉన్న పశువుల మీద అద్లయి కొడుకు షాపాతు నియామకం జరిగింది. ఒంటెల మీద ఇష్మాయేలీయుడైన ఓబీలు, గాడిదల మీద మేరోనోతీయుడైన యెహెద్యాహు నియామకం జరిగింది. గొర్రెల మీద హగ్రీయుడైన యాజీజు నియామకం జరిగింది. వీళ్ళందరూ దావీదు రాజు ఆస్తి మీద నియమించిన అధిపతులు.
  • వ్యవసాయాన్ని ప్రేమించిన ఉజ్జియాకు రైతులూ ద్రాక్షతోటల పనివారూ ఉన్నారు2 దిన 26:10
    వచనాలు
    2 దిన 26:10అతడు అరణ్యంలో కావలి గోపురాలు కట్టించి చాలా బావులు తవ్వించాడు. అతనికి పల్లపు భూముల్లో, మైదాన భూముల్లో చాలా పశు సంపద ఉంది. కాబట్టి కొండ సీమలో ప్రాంతంలో అతనికి సారవంతమైన భూమీ రైతులూ ద్రాక్షతోట పనివారూ ఉన్నారు. ఎందుకంటే అతనికి వ్యవసాయమంటే ఎంతో ఇష్టం.
  • సొలొమోను ద్రాక్షతోటలూ పండ్ల తోటలూ నాటి, కోనేర్లు కట్టిస్తాడుప్రస 2:4–6
    వచనాలు
    ప్రస 2:4–6నేను గొప్ప గొప్ప పనులు చేశాను. నా కోసం ఇళ్ళు కట్టించుకున్నాను, ద్రాక్షతోటలు నాటించుకున్నాను. తోటలు, ఉద్యానవనాలను వేయించి వాటిలో పలు రకాల పండ్ల చెట్లు నాటించాను. ఆ చెట్లకు నీటి కోసం నేను చెరువులు తవ్వించాను.
  • దున్నడం, వరుసల్లో విత్తడం, ఒక్కో పంటను దాని పద్ధతిలో నూర్చడంయెష 28:24–28
    వచనాలు
    యెష 28:24–28రైతు విత్తడానికి ఎప్పుడూ పొలం దున్నుతూనే ఉంటాడా? ఎప్పుడూ పొలంలో మట్టి పెళ్లలను పగలగొడుతూ ఉంటాడా? అతడు నేలను చదును చేసిన తర్వాత సోపు గింజలు చల్లడా? జీలకర్ర చల్లడా? గోధుమలు వరుసల్లో, బార్లీ సరైన స్థలంలో వేసి చేను అంచుల్లో మిరప మొక్కలు నాటడా? అతడి దేవుడే అతడికి ఆ క్రమాన్ని నేర్పించాడు. ఎలా చేయాలో జ్ఞానంతో అతనికి బోధించాడు. జీలకర్రను యంత్రంలో ఉంచి నూర్చారు. జీలకర్ర పై బండి చక్రాన్ని దొర్లించరు. కానీ సోపుని చువ్వతో, జీలకర్రను కర్రతో దుళ్ళకొడతారు. మనుషులు రొట్టెల కోసం గోధుమలను నూర్చి పిండి చేస్తారు. కానీ అదేపనిగా గోధుమలను పిండి చేస్తూనే ఉండరు కదా! గోధుమలను దుళ్ళగొట్టడానికి గుర్రాలనూ బండి చక్రాలనూ నడిపిస్తారు గానీ దాన్ని పిండి చేయడానికి కాదు కదా!
  • రైతు తొలకరి, కడవరి వర్షాల కోసం కనిపెడతాడుయాకో 5:7
    వచనాలు
    యాకో 5:7కాబట్టి సోదరులారా, ప్రభువు రాక వరకూ సహనంతో ఉండండి. రైతు తొలకరి వాన, కడవరి వాన కురిసే దాకా విలువైన పంట కోసం ఓపికతో ఎదురు చూస్తూ వేచి ఉంటాడు కదా.
  • శిష్యులు పొలాల గుండా నడుస్తూ వెన్నులు తెంపుకుంటారుమత్తయి 12:1
    వచనాలు
    మత్తయి 12:1ఆ రోజుల్లో యేసు ఒక విశ్రాంతి దినాన పంటచేలో పడి వెళ్తూ ఉంటే ఆయన శిష్యులకు ఆకలి వేసి కంకులు తుంచి తింటున్నారు.
  • దారి పక్కన, రాతి నేలలో, ముళ్ళ పొదల మధ్య, మంచి నేలలో విత్తనాలు (ఉపమానం)మత్తయి 13:3–8
    వచనాలు
    మత్తయి 13:3–8ఆయన వారిని చూసి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాడు. ఆయన వారితో, “విత్తనాలు చల్లేవాడు చల్లడానికి బయలుదేరాడు. అతడు విత్తనాలు చల్లుతూ ఉంటే కొన్ని విత్తనాలు దారి పక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని మింగివేశాయి. కొన్ని విత్తనాలు మట్టి ఎక్కువగా లేని రాతి నేలమీద పడ్డాయి. అక్కడ మట్టి లోతుగా లేకపోవడం చేత అవి వెంటనే మొలకెత్తాయిగానీ, ఎండ వచ్చినప్పుడు అవి మాడిపోయి వేరులు లేకపోవడంతో ఎండిపోయాయి. కొన్ని విత్తనాలు ముళ్ళ కంపల్లో పడ్డాయి. ముళ్ళ కంపలు ఎదిగి వాటిని అణిచి వేశాయి. మరికొన్ని విత్తనాలు మంచి నేలపై పడి పంటకు వచ్చాయి. వాటిలో కొన్ని వంద రెట్లు, కొన్ని అరవై రెట్లు, కొన్ని ముప్ఫై రెట్లు ఫలించాయి.
  • రోజుకు ఒక దేనారం కూలికి ద్రాక్షతోటలో పనివారిని పెట్టుకుంటారు (ఉపమానం)మత్తయి 20:1–2
    వచనాలు
    మత్తయి 20:1–2“ఎలాగంటే, పరలోకరాజ్యం ఈ విధంగా ఉంది, ఒక ఇంటి యజమాని తన ద్రాక్షతోటలో కూలికి పనివారి కోసం వేకువనే లేచి బయలుదేరాడు. రోజుకు ఒక దేనారం ఇస్తానని ఒప్పుకుని కొందరు పనివారిని తన ద్రాక్షతోటలోకి పంపించాడు.

ధర్మశాస్త్రంలో

  • ఆరు సంవత్సరాలు విత్తండి; ఏడో సంవత్సరం భూమికి విశ్రాంతినిర్గ 23:10–11, లేవీ 25:3–5
    వచనాలు
    నిర్గ 23:10–11ఆరు సంవత్సరాల పాటు నీ భూమిని దున్ని దాని పంట సమకూర్చుకోవాలి. ఏడవ సంవత్సరం నీ భూమిని బీడుగా వదిలి పెట్టాలి. అప్పుడు మిగిలి ఉన్న పంటను నీ ప్రజల్లోని పేదవారు తీసుకున్న తరువాత మిగిలినది అడవి జంతువులు తినవచ్చు. మీకు చెందిన ద్రాక్ష, ఒలీవ తోటల విషయంలో కూడా ఈ విధంగానే చెయ్యాలి.
    లేవీ 25:3–5ఆరు సంవత్సరాలు నీ పొలంలో విత్తనాలు చల్లాలి. ఆరు సంవత్సరాలు నీ పండ్ల తోటను సాగుచేసి దాని పండ్లు సమకూర్చుకోవచ్చు. ఏడవ సంవత్సరం భూమికి మహా విశ్రాంతి కాలం, అంటే అది యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరంగా ఉండాలి. ఆ సంవత్సరం నీ పొలంలో విత్తనాలు చల్ల కూడదు. నీ పండ్ల తోటను బాగు చేయకూడదు. బీడుగా వదిలిన చేలో దానంతట అదే పండిన పంట కోత కోసం ఏర్పాట్లు చేసుకోకూడదు. బాగు చేయని నీ చెట్ల పండ్లు ఏరుకోకూడదు. అది భూమికి విశ్రాంతి సంవత్సరం.
  • దున్నే కాలంలో, కోతకాలంలో కూడా ఏడో రోజు విశ్రాంతి తీసుకోండినిర్గ 34:21
    వచనాలు
    నిర్గ 34:21ఆరు రోజులు మీ పనులు చేసుకున్న తరువాత ఏడవ రోజున విశ్రాంతి తీసుకోవాలి. అది పొలం దున్నే కాలమైనా, కోత కోసే కాలమైనా.
  • పొలం అంచులనూ రాలిన ద్రాక్షలనూ పేదల కోసం విడిచిపెట్టండిలేవీ 19:9–10
    వచనాలు
    లేవీ 19:9–10మీరు మీ పొలం పంట కోసేటప్పుడు నీ పొలం మూలల్లొ పూర్తిగా కోయకూడదు. నీ కోతలో పరిగె ఏరుకోకూడదు. నీ పండ్ల చెట్ల పరిగెను సమకూర్చుకోకూడదు. నీ ద్రాక్ష తోటలో పండ్లన్నిటినీ సేకరించుకో కూడదు. ద్రాక్ష తోటలో రాలిన పండ్లను ఏరుకోకూడదు. పేదలకు, పరదేశులకు వాటిని విడిచిపెట్టాలి.
  • మరిచిపోయిన పనను పరదేశికీ తండ్రిలేనివారికీ వితంతువుకూ విడిచిపెట్టాలిద్వితీ 24:19–21
    వచనాలు
    ద్వితీ 24:19–21మీ పొలంలో మీ పంట కోస్తున్నప్పుడు పొలంలో ఒక పన మర్చిపోతే దాన్ని తెచ్చుకోడానికి మీరు తిరిగి వెనక్కి వెళ్ళకూడదు. మీ దేవుడైన యెహోవా మీరు చేసే పనులన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదించేలా అది పరదేశులకు, తండ్రి లేనివారికీ, విధవరాళ్లకూ మిగల్చాలి. మీ ఒలీవ పండ్లను ఏరుకునేటప్పుడు మీ వెనక ఉన్న పరిగెను ఏరుకోకూడదు. అవి పరదేశులకు, తండ్రి లేనివారికీ, విధవరాళ్లకూ మిగల్చాలి. మీ ద్రాక్షపండ్లను కోసుకొనేటప్పుడు మీ వెనకపడిపోయిన గుత్తిని ఏరుకోకూడదు. అది పరదేశులకు, తండ్రి లేనివారికీ, విధవరాళ్లకూ మిగల్చాలి.
  • రెండు రకాల విత్తనాలు వద్దు; ఎద్దునూ గాడిదనూ కలిపి కాడికి కట్టవద్దులేవీ 19:19, ద్వితీ 22:9–10
    వచనాలు
    లేవీ 19:19మీరు నా శాసనాలను పాటించాలి. నీ జంతువులకు ఇతర జాతి జంతువులతో సంపర్కం చేయకూడదు. నీ పొలంలో వేరు వేరు జాతుల విత్తనాలు చల్లకూడదు. రెండు రకాల దారాలతో నేసిన బట్టలు ధరించకూడదు.
    ద్వితీ 22:9–10మీ ద్రాక్షతోటలో రెండు రకాల విత్తనాలను విత్తకూడదు. అలా చేస్తే మీరు వేసిన పంట, ద్రాక్షతోట రాబడి మొత్తం, దేవాలయానికి ప్రతిష్టితమవుతుంది. ఎద్దునూ గాడిదనూ జతచేసి భూమిని దున్నకూడదు.
  • కొత్తగా నాటిన చెట్టు పండ్లను మూడు సంవత్సరాలు తినకూడదులేవీ 19:23–25
    వచనాలు
    లేవీ 19:23–25మీరు ఆ దేశానికి వచ్చి తినడానికి రకరకాల చెట్లు నాటినప్పుడు వాటి పండ్లను నిషేధంగా ఎంచాలి. మూడు సంవత్సరాల పాటు అవి మీకు అపవిత్రంగా ఉండాలి. వాటిని తినకూడదు. నాలుగో సంవత్సరంలో వాటి పండ్లన్నీ యెహోవాకు ప్రతిష్ఠితమైన స్తుతి అర్పణలుగా ఉంటాయి. ఐదో సంవత్సరంలో వాటి పండ్లను తినొచ్చు. నేను మీ దేవుడైన యెహోవాను.
  • దారితప్పిన పశువుల నష్టానికీ పొలంలో అంటుకున్న మంటకూ పరిహారంనిర్గ 22:5–6
    వచనాలు
    నిర్గ 22:5–6ఒకడు తన పశువును మేత మేయడానికి తన పొలం లోకి గానీ, ద్రాక్ష తోటలోకి గానీ వదిలినప్పుడు అది వేరొక వ్యక్తి పొలంలో మేస్తే ఆ పొలం యజమానికి తన పంటలో, ద్రాక్షతోటలో శ్రేష్ఠమైనది తిరిగి చెల్లించాలి. నిప్పు రాజుకుని ముళ్ళకంపలు అంటుకోవడం వల్ల వేరొకరి పంట కుప్పలైనా, పొలంలో పైరులైనా, పొలమైనా తగలబడి పోతే నిప్పు అంటించిన వాడు జరిగిన నష్టాన్ని పూడ్చాలి.
  • పొరుగువాని ద్రాక్షతోటలో కడుపు నిండా తినవచ్చు, కాని బుట్టలో వేసుకోకూడదుద్వితీ 23:24–25
    వచనాలు
    ద్వితీ 23:24–25మీరు మీ పొరుగువాడి ద్రాక్షతోటకు వెళ్ళేటప్పుడు మీ కిష్టమైనన్ని ద్రాక్షపండ్లు తినవచ్చు గానీ మీ సంచిలో వేసుకోకూడదు. మీ పొరుగువాడి పంట చేలోకి వెళ్ళేటప్పుడు మీ చేతితో వెన్నులు తుంచుకోవచ్చు గానీ మీ పొరుగువాడి పంటచేలో కొడవలి వెయ్యకూడదు.”
  • కళ్ళం తొక్కే ఎద్దుకు చిక్కం కట్టవద్దుద్వితీ 25:4
    వచనాలు
    ద్వితీ 25:4కళ్ళం నూర్చే ఎద్దు మూతికి చిక్కం కట్టకూడదు.
  • కొత్త ద్రాక్షతోట ఫలం ఇంకా అనుభవించనివాడు యుద్ధం నుంచి ఇంటికి వెళ్తాడుద్వితీ 20:6
    వచనాలు
    ద్వితీ 20:6ఎవరైనా ద్రాక్షతోట వేసి ఇంకా దాని పళ్ళు తినకుండా యుద్ధంలో చనిపోతే వేరొకడు దాని పళ్ళు తింటాడు. కాబట్టి అలాంటివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు.

సూక్తులు

  • తన భూమిని సాగుచేసేవానికి సమృద్ధిగా ఆహారం ఉంటుందిసామె 12:11
    వచనాలు
    సామె 12:11తన భూమిని సేద్యం చేసుకునే వాడికి ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది. బుద్ధిహీనుడు వ్యర్థమైన వాటిని అనుసరిస్తాడు.
  • ముళ్ళు పెరిగిన సోమరి పొలం, దాని రాతి గోడ కూలిపోయిందిసామె 24:30–31
    వచనాలు
    సామె 24:30–31సోమరిపోతు చేను నేను దాటి వస్తుంటే తెలివిలేనివాడి ద్రాక్షతోట నేను దాటి వస్తుంటే, ఇదిగో దాన్నిండా ముండ్ల తుప్పలు పెరిగి ఉన్నాయి. ముళ్ళపొదలు వ్యాపించి ఉన్నాయి. దాని రాతి గోడ శిథిలం అయి పోయింది.
  • ఉదయం నీ విత్తనాలు విత్తు; సాయంత్రం నీ చేతులకు విశ్రాంతి ఇవ్వకుప్రస 11:6
    వచనాలు
    ప్రస 11:6ఉదయాన విత్తనం నాటు. సాయంత్రం వరకూ అవసరమైనంత మట్టుకు నీ చేతులతో పని చెయ్యి. ఏవి ఫలిస్తాయో, ఉదయమా, సాయంత్రమా లేక రెండూ ఒకేలా బాగుంటాయో నీకు తెలియదు.
  • నీ మందల, నీ పశువుల స్థితిని బాగా తెలుసుకోసామె 27:23–27
    వచనాలు
    సామె 27:23–27నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలిసుకో. నీ మందల మీద మనస్సు ఉంచు. డబ్బు శాశ్వతం కాదు. కిరీటం తరతరాలు ఉంటుందా? ఎండిన గడ్డి వామి వేస్తారు. పచ్చిక ఇక కనిపించడం లేదు. మొలకలు వస్తున్నాయి. ఆలమందల కోసం కొండగడ్డి కోసుకొస్తున్నారు. నీకు వెచ్చటి బట్టల కోసం గొర్రెపిల్లలున్నాయి. ఒక చేను కొనడానికి మేకలు సరిపోతాయి. నీ ఆహారానికి, నీ కుటుంబం తినే ఆహారానికి, నీ దాసదాసీల పోషణకు మేకపాలు ఉంటాయి.
  • కొంచెంగా విత్తేవాడు కొంచెంగానే కోస్తాడు2 కొరింతీ 9:6
    వచనాలు
    2 కొరింతీ 9:6“కొద్దిగా చల్లేవాడు కొద్ది పంట కోస్తాడు. విస్తారంగా చల్లేవాడు విస్తారమైన పంట కోస్తాడు” అని దీని గురించి చెప్పవచ్చు.
  • కష్టపడే రైతు పంటలో మొదట భాగం పొందాలి2 తిమో 2:6
    వచనాలు
    2 తిమో 2:6కష్టపడిన వ్యవసాయదారుడే రాబడిలో మొదటి భాగం పొందడానికి అర్హుడు.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు