Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › అంశాలు › ఆహారం

దైనందిన జీవితం

బైబిల్‌లో ఆహారం

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 38 భాగాలు, వాక్యం వాక్యంగా.

ప్రజలు ఏమి తినేవారు

  • ఇంటివారి కోసం మేక పాలుసామె 27:27
    వచనాలు
    సామె 27:27నీ ఆహారానికి, నీ కుటుంబం తినే ఆహారానికి, నీ దాసదాసీల పోషణకు మేకపాలు ఉంటాయి.
  • పెరుగు, పాలు, గొర్రెపిల్లల కొవ్వు, మేలైన గోధుమద్వితీ 32:14
    వచనాలు
    ద్వితీ 32:14ఆవు మజ్జిగను, గొర్రెల, మేకల పాలనూ, గొర్రెపిల్లల కొవ్వునూ, బాషాను పొట్టేళ్లను, మేకపోతులనూ, శ్రేష్ఠమైన గోదుమ పిండినీ మీకిచ్చాడు. మంచి ద్రాక్షరసంతో చేసిన మద్యం మీరు తాగారు.
  • సైన్యాధిపతి కోసం పది జున్ను ముక్కలు1 సమూ 17:17–18
    వచనాలు
    1 సమూ 17:17–18యెష్షయి తన కొడుకు దావీదును పిలిచి “ఒక తూముడు వేయించిన గోదుమలనూ పది రొట్టెలనూ తీసుకు సైన్యంలో ఉన్న నీ అన్నల కోసం తొందరగా వెళ్ళు. ఇంకా ఈ పది జున్నుగడ్డలు తీసికువెళ్ళి వారి సహస్రాధిపతికి ఇవ్వు. నీ అన్నల క్షేమసమాచారం తెలుసుకుని వారి దగ్గరనుండి ఏదైనా గుర్తు తీసుకురా” అని చెప్పి పంపించాడు.
  • దావీదు మనుషుల కోసం గోధుమ, బార్లీ, చిక్కుడు, కందులు, తేనె, జున్ను2 సమూ 17:28–29
    వచనాలు
    2 సమూ 17:28–29ఎడారిలో దావీదు, అతని మనుషులు అలసిపోయి, ఆకలి దాహంతో ఉంటారని గ్రహించి, పరుపులు, వంటపాత్రలు, కుండలు, వారంతా తినడం కోసం గోదుమలు, యవల పిండి, పప్పులు, చిక్కుడు కాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్నుముద్దలు తీసుకువచ్చారు.
  • అబ్రాహాము రొట్టె, లేత దూడ, పెరుగు, పాలు వడ్డిస్తాడుఆది 18:5–8
    వచనాలు
    ఆది 18:5–8మీ దాసుడినైన నా దగ్గరికి వచ్చారు కదా, కొంచెం ఆహారం తీసుకు వస్తాను. దాన్ని తిని సేద దీర్చుకోండి. ఆ తరువాత మీ దారిన మీరు వెళ్ళవచ్చు.” అందుకు వారు “నువ్వు చెప్పినట్టే చెయ్యి” అన్నారు. అప్పుడు అబ్రాహాము వెంటనే గుడారంలో ఉన్న శారా దగ్గరికి వెళ్ళి “నువ్వు త్వరగా 21 కిలోల మెత్తటి పిండి తెచ్చి కలిపి రొట్టెలు చెయ్యి” అన్నాడు. తరువాత అబ్రాహాము పశువుల మంద దగ్గరికి పరుగెత్తి ఒక మంచి లేగ దూడను పట్టుకు వచ్చి ఒక పనివాడికి ఇచ్చాడు. వాడు త్వరత్వరగా దాన్నివధించి వండి సిద్ధం చేశాడు. తరువాత అతడు పెరుగూ, పాలూ వాటితోపాటు తాను వండించి సిద్ధం చేయించిన దూడ మాంసాన్ని తెచ్చి వాళ్ళ ముందు పెట్టాడు. వాళ్ళు భోజనం చేస్తుంటే అక్కడే ఆ చెట్టు కిందే నిలబడ్డాడు.
  • రూతు రొట్టెను చిరకలో ముంచి, వేయించిన గింజలు తింటుందిరూతు 2:14
    వచనాలు
    రూతు 2:14భోజన సమయంలో బోయజు “నువ్వు ఇక్కడికే వచ్చి భోజనం చెయ్యి. నీ రొట్టెముక్కలను ద్రాక్షారసంలో ముంచుకుని తిను” అని చెప్పాడు. కాబట్టి ఆమె పంట కోసే వాళ్ళ దగ్గర కూర్చుంది. బోయజు ఆమెకు కొన్ని పేలాలు ఇచ్చాడు. ఆమె కొన్ని తృప్తిగా తిని కొన్ని మిగిల్చింది.
  • అందరికీ ఒక రొట్టె, ఖర్జూరపు ముద్ద, ఎండు ద్రాక్షల అడ ఒకటి2 సమూ 6:19
    వచనాలు
    2 సమూ 6:19సమావేశమైన ఇశ్రాయేలీయుల్లో స్త్రీ పురుషులందరికీ రొట్టె, మాంసం, ఎండు ద్రాక్షముద్ద ఒక్కొక్కటి చొప్పున పంచిపెట్టాడు. తరువాత ప్రజలంతా తమ తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు.
  • అబీగయీలు రొట్టెలు, ద్రాక్షారసం, గొర్రెలు, ఎండు ద్రాక్షలు, అంజూరపు అడలు తెస్తుంది1 సమూ 25:18
    వచనాలు
    1 సమూ 25:18అప్పుడు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పకుండా గబగబా 200 రొట్టెలు, రెండు ద్రాక్షారసం తిత్తులు, వండిన ఐదు గొర్రెల మాంసం, ఐదు మానికల వేయించిన ధాన్యం, 100 ఎండు ద్రాక్షగెలలు, 200 అంజూరు పండ్ల ముద్దలు గాడిదలకెక్కించి
  • సీబా దావీదుకు రొట్టెలు, ఎండు ద్రాక్షలు, వేసవి పండ్లు తెస్తాడు2 సమూ 16:1–2
    వచనాలు
    2 సమూ 16:1–2దావీదు కొండ అంచుకు అవతల కొంచెం దూరం వెళ్లినప్పుడు మెఫీబోషెతు సేవకుడు సీబా కళ్ళకు గంతలు కట్టిబడి ఉన్న రెండు గాడిదలను తీసుకువచ్చాడు. గాడిదలపై 200 రొట్టెలు, 100 ద్రాక్ష గెలలు, వంద అంజూర ఫలాలున్న కొమ్మలు, ఒక ద్రాక్షారసపు తిత్తి వేయబడి ఉన్నాయి. రాజు “ఇవి ఎందుకు తెచ్చావు?” అని సీబాను అడిగాడు. అప్పుడు సీబా “రాజు పరివారం ఎక్కడానికి గాడిదలు, పనివారు తినడానికి రొట్టెలు, అంజూర ఫలాల కొమ్మలు, ఎడారిలో అలసిపోయిన వారు తాగడానికి ద్రాక్షారసం తెచ్చాను” అని చెప్పాడు.
  • ఆకలితో చచ్చిపోతున్న ఒక ఐగుప్తీయుడు అంజూరపు అడ, ఎండు ద్రాక్షలతో తేరుకుంటాడు1 సమూ 30:11–12
    వచనాలు
    1 సమూ 30:11–12ఒక పొలంలో ఒక ఐగుప్తీయుడు తారసపడ్డాడు. వారు దావీదు దగ్గరికి అతణ్ణి తీసుకు వచ్చి భోజనం పెడితే, తిన్నాడు. దాహానికి నీరిస్తే, తాగాడు. వారు అతనికి అంజూరపు ముద్ద తుంచి ఇచ్చారు. రెండు ఎండు ద్రాక్ష ముద్దలు అతనికిచ్చారు. అతడు మూడు రోజులనుండి పస్తులున్నాడు. భోజనం చేసిన తరువాత అతడి ప్రాణం తెప్పరిల్లింది.
  • ఐగుప్తులో చేపలు, దోసకాయలు, పుచ్చకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, వెల్లుల్లిసంఖ్యా 11:5
    వచనాలు
    సంఖ్యా 11:5ఐగుప్తులో మేము స్వేచ్ఛగా ఆరగించిన చేపలూ, కీర దోస కాయలూ, కర్బూజాలూ, ఆకు కూరలూ, ఉల్లి పాయలూ, వెల్లుల్లీ మాకు గుర్తుకు వస్తున్నాయి.
  • రొట్టె, కందిపప్పు కూరఆది 25:34
    వచనాలు
    ఆది 25:34యాకోబు తన దగ్గర ఉన్న రొట్టె, చిక్కుడు కాయల కూర ఏశావుకు ఇచ్చాడు. ఏశావు రొట్టే, కూరా తిని, తాగి అక్కడ నుండి తన దారిన వెళ్లి పోయాడు. ఆ విధంగా ఏశావు తన జ్యేష్ఠత్వపు జన్మ హక్కుని తిరస్కారంగా ఎంచాడు.
  • మన్నా రుచి తేనెతో చేసిన అప్పడాల్లా ఉందినిర్గ 16:31
    వచనాలు
    నిర్గ 16:31ఇశ్రాయేలీయులు ఆ పదార్థానికి “మన్నా” అని పేరు పెట్టారు. అది తెల్లగా ధనియాల వలే ఉంది. దాని రుచి తేనెతో కలిపిన పిండి వంటకం లాగా ఉంది.
  • దేశపు వేయించిన గింజలు; ఆ తర్వాత మన్నా ఆగిపోయిందియెహో 5:11–12
    వచనాలు
    యెహో 5:11–12పస్కా పండగ అయిన ఉదయమే వారు ఆ దేశపు పంటను తిన్నారు. ఆ రోజే వారు పొంగని రొట్టెలనూ, వేయించిన ధాన్యాలనూ తిన్నారు. ఆ రోజు వారు ఆ దేశపు పంటను తిన్న తరువాత మన్నా ఆగిపోయింది, అప్పటినుండి ఇశ్రాయేలీయులకు ఇక మన్నా దొరకలేదు. ఆ సంవత్సరం వారు కనాను దేశపు పంటను తిన్నారు.
  • గోధుమ, బార్లీ, చిక్కుడు, కందులు, సజ్జలు, జొన్నలతో రొట్టెయెహె 4:9
    వచనాలు
    యెహె 4:9నీ కోసం గోధుమలూ, బార్లీ, చిక్కుడు గింజలూ, కాయ ధాన్యాలూ, జొన్నలూ, సజ్జలూ తెచ్చుకో. వాటన్నిటినీ ఒక పాత్రలో వేసి నువ్వు ఒక వైపున పడుకునే రోజుల లెక్క ప్రకారం రొట్టెలు చేసుకోవాలి. 390 రోజులు నువ్వు ఇలాగే చేసుకుని తినాలి!
  • దానియేలు కేవలం కూరగాయలూ నీళ్ళూ అడుగుతాడుదాని 1:12
    వచనాలు
    దాని 1:12“నీ దాసులమైన మాకు తినడానికి శాకాహారం, తాగడానికి మంచినీళ్లు మాత్రం ఇప్పించు. అలా పది రోజులపాటు ఇచ్చి మమ్మల్ని పరీక్షించు.
  • కాకులు ఉదయం సాయంత్రం ఏలీయాకు రొట్టె, మాంసం తెస్తాయి1 రాజులు 17:6
    వచనాలు
    1 రాజులు 17:6అక్కడ కాకులు ఉదయమూ సాయంత్రమూ రొట్టె, మాంసాలను అతని దగ్గరికి తెచ్చేవి. అతడు వాగు నీళ్ళు తాగాడు.
  • బాప్తిసమిచ్చే యోహాను మిడతలూ అడవి తేనే తినేవాడుమత్తయి 3:4
    వచనాలు
    మత్తయి 3:4ఈ యోహాను ఒంటె వెంట్రుకలతో నేసిన బట్టలూ నడుముకు తోలు నడికట్టు కట్టుకునేవాడు. అతని ఆహారం మిడతలు, అడవి తేనె.
  • కొవ్విన ఎద్దు కంటే ప్రేమ ఉన్నచోట కూరాకు భోజనం మేలుసామె 15:17
    వచనాలు
    సామె 15:17ద్వేషం నిండిన ఇంట్లో కొవ్విన ఎద్దు మాంసం తినడం కంటే ప్రేమ ఉన్న చోట ఆకుకూరల భోజనం తినడం మేలు.
  • ఒక కొడుకు రొట్టె గాని చేప గాని అడుగుతాడుమత్తయి 7:9–10
    వచనాలు
    మత్తయి 7:9–10మీలో ఎవరైనా, తన కొడుకు రొట్టె అడిగితే వాడికి రాయినిస్తాడా? లేక వాడు చేపను అడిగితే పామునిస్తాడా?
  • సరస్సు ఒడ్డున నిప్పుల మీద చేపలు, రొట్టెయోహా 21:9
    వచనాలు
    యోహా 21:9ఒడ్డుకి రాగానే వారికి అక్కడ నిప్పులూ, వాటి పైన ఉన్న చేపలూ రొట్టే కనిపించాయి.
  • తిరిగి లేచిన యేసు కాల్చిన చేప ముక్క తింటాడులూకా 24:42
    వచనాలు
    లూకా 24:42వారు కాల్చిన చేప ముక్కను ఆయనకు ఇచ్చారు.

భోజనం దగ్గర

  • రిబ్కా రెండు మేకపిల్లలతో రుచికరమైన వంటకం చేస్తుందిఆది 27:9
    వచనాలు
    ఆది 27:9నువ్వు మంద దగ్గరికి వెళ్ళి రెండు మంచి మేక పిల్లలను పట్టుకుని రా. నేను వాటితో మీ నాన్నఇష్టపడే విధంగా రుచిగా భోజనం తయారు చేస్తాను.
  • స్త్రీలు వంటవారుగా, రొట్టెలు కాల్చేవారుగా పనిచేసేవారు1 సమూ 8:13, సామె 31:15
    వచనాలు
    1 సమూ 8:13మీ ఆడపిల్లలను వంటలు చేయడానికి, అలంకరించడానికి, రొట్టెలు కాల్చడానికి పెట్టుకొంటాడు.
    సామె 31:15ఆమె చీకటితోనే లేచి, తన యింటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది. తన సేవికలకు జీతం నిర్ణయిస్తుంది.
  • ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి తినేవారు కాదుఆది 43:32
    వచనాలు
    ఆది 43:32అతనికీ వారికీ అతనితో భోజనం చేస్తున్న ఐగుప్తీయులకు వేర్వేరుగా వడ్డించారు. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనం చేయరు. అది ఐగుప్తీయులకు అసహ్యం.
  • రొట్టె విరిచే ముందు కృతజ్ఞతలు చెప్పేవారుమార్కు 8:6, లూకా 24:30, అపొ.కా 27:35
    వచనాలు
    మార్కు 8:6యేసు ఆ ప్రజలందరినీ నేల మీద కూర్చోమని ఆజ్ఞాపించాడు. ఆ ఏడు రొట్టెలను చేతపట్టుకుని దేవునికి కృతజ్ఞత చెప్పి వాటిని విరిచి శిష్యులకిచ్చి వారికి పంచమన్నాడు. శిష్యులు అలాగే చేశారు.
    లూకా 24:30ఆయన వారితో భోజనానికి కూర్చున్నప్పుడు, ఒక రొట్టెను పట్టుకుని దానికోసం కృతజ్ఞతలు చెప్పి, విరిచి తినడానికి వారికిచ్చాడు.
    అపొ.కా 27:35ఈ మాటలు చెప్పి, ఒక రొట్టె పట్టుకుని అందరి ముందూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగాడు.
  • చివరి భోజనం తర్వాత ఒక కీర్తన పాడారుమత్తయి 26:30
    వచనాలు
    మత్తయి 26:30అప్పుడు వారు ఒక కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళారు.

ఆహారంగా నిషేధించినవి

  • భూజంతువులు: రెండుగా చీలిన డెక్కలుండి నెమరు వేసేవి మాత్రమేలేవీ 11:3–4
    వచనాలు
    లేవీ 11:3–4చీలిన డెక్కలు ఉండి ఏ జంతువు అయితే నెమరు వేస్తుందో ఆ జంతువుని మీరు ఆహారంగా తీసుకోవచ్చు. అయితే జంతువుల్లో కొన్ని నెమరు వేస్తాయి. కొన్నిటికి చీలిన డెక్కలుంటాయి. ఇలాంటి వాటిని మీరు ఆహారంగా తీసుకోకూడదు. ఒంటె లాంటి జంతువులు నెమరు వేస్తాయి. కానీ దానికి చీలిన డెక్కలుండవు. కాబట్టి ఒంటెను మీరు అపవిత్రంగా ఎంచాలి.
  • నీటి జీవులు: రెక్కలూ పొలుసులూ ఉన్నవి మాత్రమేలేవీ 11:9–10
    వచనాలు
    లేవీ 11:9–10జలచరాల్లో వీటిని తినవచ్చు. సముద్రంలోనైనా, నదిలో నైనా నీటిలో నివసించే అన్ని రకాల జీవుల్లో రెక్కలూ, పొలుసులూ ఉన్న వాటిని మీరు తినవచ్చు. సముద్రంలోనైనా, నదిలో నైనా నీటిలో కదిలే అన్ని రకాల జీవుల్లోనూ, జల జంతువుల్లోనూ రెక్కలూ, పొలుసులూ లేని వాటిని మీరు అసహ్యించుకోవాలి.
  • గరుడ పక్షులు, రాబందులు, పేర్కొన్న ఇతర పక్షులు తినకూడదులేవీ 11:13
    వచనాలు
    లేవీ 11:13పక్షుల్లో మీరు అసహ్యించుకోవాల్సినవీ, తినకూడనివీ ఏవంటే, గద్ద, రాబందు,
  • మిడతలు, గొల్లభామలు, కీచురాళ్ళు తినవచ్చులేవీ 11:21–22
    వచనాలు
    లేవీ 11:21–22అయితే రెక్కలు ఉండి నలుగు కాళ్ళతో నడిచే, ఎగరగలిగే జీవులు, నేలపై గంతులు వేయడానికి తొడలు గల పురుగులన్నిటినీ మీరు తినవచ్చు. అన్ని రకాల మిడతలను మీరు తినవచ్చు. ఆకు మిడత, కీచురాయి, గడ్డి మిడత ఇలా అన్ని రకాల మిడతలను మీరు తినవచ్చు.
  • రక్తాన్ని కార్చి మట్టితో కప్పాలిలేవీ 17:13–14
    వచనాలు
    లేవీ 17:13–14అలాగే ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైనా లేదా మీ మధ్య నివసించే ఏ విదేశీయుడైనా తినదగిన జంతువునో, పక్షినో వేటాడి చంపితే దాని రక్తాన్ని పారబోసి మట్టితో కప్పాలి. ఎందుకంటే ప్రతి ప్రాణికీ దాని రక్తమూ, ప్రాణమూ ఒక్కటే. రక్తం, ప్రాణంతో కలసి ఉంటుంది. కాబట్టి నేను ఇశ్రాయేలు ప్రజలకి ‘మీరు జంతువు రక్తాన్నీ ఆహారంగా తీసుకోకూడదు. ఎందుకంటే జీవులన్నిటికీ ప్రాణం వాటి రక్తంలోనే ఉంటుంది. దాన్ని తినేవాడు ప్రజల్లో లేకుండా తీసివేస్తాను’ అని ఆదేశించాను.
  • పొలంలో క్రూర మృగం చీల్చిన జంతువు మాంసం తినకూడదునిర్గ 22:31
    వచనాలు
    నిర్గ 22:31మీరు నాకు ప్రత్యేకంగా ఉన్న వాళ్ళు గనుక పొలాల్లో మృగాలు చీల్చిన జంతు మాంసం తినకూడదు. దాన్ని కుక్కలకు పారవెయ్యాలి.”
  • మేకపిల్లను దాని తల్లి పాలలో వండకూడదునిర్గ 23:19, ద్వితీ 14:21
    వచనాలు
    నిర్గ 23:19నీ భూమిలో పండే వాటిలో ప్రథమ ఫలాలు యెహోవా దేవుని మందిరానికి తీసుకురావాలి. మేకపిల్ల మాంసం దాని తల్లిపాలలో కలిపి ఉడకబెట్ట కూడదు.
    ద్వితీ 14:21దానికదే చచ్చిన దాన్ని మీరు తినకూడదు. అయితే దాన్ని మీ ఇంటి ఆవరణంలో ఉన్న పరదేశికి తినడానికి ఇయ్యవచ్చు. లేక అన్యునికి దాన్ని అమ్మవచ్చు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవాకు మీరు ప్రతిష్ఠితమైన ప్రజలు. మేకపిల్లను దాని తల్లి పాలతో కలిపి వండకూడదు.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు