రోజుల తరబడి మండిన మంటలు నగరంలో చాలా భాగాన్ని నాశనం చేశాయి. నీరో క్రైస్తవులపై నింద మోపి వారిలో చాలా మందిని చంపించాడని చరిత్రకారుడు టాసిటస్ రాస్తాడు — రోమ్ క్రైస్తవులను హింసించినట్టు తెలిసిన వాటిలో ఇదే మొదటిది.
విజ్ఞాన సర్వస్వం › ఇదే సమయంలో లోకంలో
బైబిల్లో · సుమారు క్రీ.శ. 60–62 · రోమ్
రోమ్‌లో పౌలు
మెలితే ద్వీపం దగ్గర ఓడ బద్దలైన తరువాత పౌలు రోమ్ చేరుతాడు; అక్కడ కావలిలో రెండు సంవత్సరాలు నివసిస్తూ తన దగ్గరికి వచ్చేవారిని చేర్చుకుంటాడు.
కవల దేవుళ్ళ చిహ్నంతో ఉన్న అలెగ్జాండ్రియ పట్టణపు ఓడ ఒకటి ఆ ద్వీపంలో చలికాలమంతా నిలిచి ఉంది. మూడు నెలలు అక్కడున్న తరువాత ఆ ఓడ ఎక్కి బయలుదేరి సురకూసై నగరానికి వచ్చి అక్కడ మూడు రోజులున్నాం. అక్కడ నుండి చుట్టూ తిరిగి రేగియు పట్టణం వచ్చి ఒక రోజు తరువాత దక్షిణపు గాలి విసరడంతో మరునాడు పొతియొలీ పట్టణం వచ్చాం. అక్కడి సోదరులను కలిసినప్పుడు వారు తమ దగ్గర ఏడు రోజులు ఉండమని మమ్మల్ని వేడుకున్నారు. ఆ తరువాత రోమ్ నగరానికి వచ్చాం. అక్కడ నుండి సోదరులు మా సంగతి విని అప్పీయా సంతపేట వరకూ, మూడు సత్రాల పేట వరకూ ఎదురు వచ్చి మమ్మల్ని ఆహ్వానించారు. పౌలు వారిని చూసి దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించి ధైర్యం తెచ్చుకున్నాడు. మేము రోమ్ కు వచ్చినప్పుడు పౌలు తనకు కాపలాగా ఉన్న సైనికులతో కలిసి ప్రత్యేకంగా ఉండడానికి అనుమతి పొందాడు. మూడు రోజుల తరువాత అతడు ప్రముఖ యూదులను తన దగ్గరికి పిలిపించాడు. వారు వచ్చినప్పుడు అతడు, “సోదరులారా, నేను మన ప్రజలకూ, పూర్వీకుల ఆచారాలకూ వ్యతిరేకంగా ఏదీ చేయకపోయినా, యెరూషలేములో నన్ను రోమీయుల చేతికి అప్పగించారు. వారు నన్ను విచారించి నాలో మరణానికి తగిన కారణం ఏదీ లేకపోవడంతో నన్ను విడిచిపెట్టాలి అనుకున్నారు గాని యూదులు అభ్యంతరం చెప్పడం వలన నేను ‘సీజరు ఎదుట చెప్పుకొంటాను’ అనవలసి వచ్చింది. నా స్వజనం మీద నేరం మోపాలని నా అభిప్రాయం కాదు. ఈ కారణం చేతనే మీతో మాట్లాడాలని పిలిపించాను. ఇశ్రాయేలు నిరీక్షణ నిమిత్తం ఈ గొలుసులతో నన్ను బంధించి ఉంచారు” అని వారితో చెప్పాడు. అందుకు వారు, “యూదయ నుండి మీ గురించి మాకేమీ ఉత్తరాలు రాలేదు, ఇక్కడికి వచ్చిన యూదు సోదరుల్లో ఒక్కడైనా మీ గురించి చెడ్డ సంగతి ఏదీ మాకు తెలుపలేదు. ఎవరూ చెప్పుకోలేదు కూడా. అయినా ఈ విషయంలో మీ అభిప్రాయం మీ నోటనే వినగోరుతున్నాం. ఈ మతభేదం గూర్చి అన్ని చోట్లా అభ్యంతరాలు ఉన్నాయని మాత్రం మాకు తెలుసు” అని జవాబిచ్చారు. అతనికి ఒక రోజు ఏర్పాటు చేసి, అతడున్న చోటికి చాలా మంది వచ్చారు. ఉదయం నుండి సాయంకాలం వరకూ అతడు దేవుని రాజ్యం గూర్చి పూర్తిగా సాక్షమిస్తూ, మోషే ధర్మశాస్త్రంలో నుండీ, ప్రవక్తల్లో నుండీ సంగతులను వారికి ఎత్తి చూపుతూ, యేసుని గూర్చి వివరంగా బోధిస్తూ వారిని ఒప్పిస్తూ ఉన్నాడు. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు. వారిలో భేదాభిప్రాయాలు కలిగాయి. పౌలు చివరిగా వారితో ఒక మాట చెప్పాడు. అదేమంటే వారు వింటారు గాని అర్థం చేసుకోరు. చూస్తారు కానీ గ్రహించుకోరు’ అని ఈ ప్రజలతో చెప్పండి. ఈ ప్రజలు కన్నులారా చూసి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండా వారి హృదయాలు బండబారి పోయాయి. వారు ఏదీ వినిపించుకోరు, వారు కళ్ళు మూసుకుని ఉన్నారు’ అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరైందే. కాబట్టి దేవుని వలన కలిగిన ఈ రక్షణ యూదేతరుల దగ్గరికి తరలి పోతున్నదని మీరు తెలుసుకుంటారు. వారు దాన్ని అంగీకరిస్తారు.” ఈ మాటలు విని వారంతా వెళ్ళిపోయారు. పౌలు రెండు సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట్లో నివసించి, తన దగ్గరికి వచ్చే వారినందరినీ ఆదరిస్తూ ఏ ఆటంకమూ లేకుండా పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యం గూర్చి ప్రకటిస్తూ, ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన సంగతులు బోధిస్తూ ఉన్నాడు.అదే సమయంలో లోకంలో
అపొస్తలుల కార్యములు పౌలు రోమ్‌లో రెండు సంవత్సరాల పాటు కావలిలో ఉంటూ, సుమారు క్రీ.శ. 60–62లో, అద్దె ఇంట్లో బహిరంగంగా బోధిస్తున్నాడని చెప్పి ముగుస్తుంది (అపొస్తలుల కార్యములు 28:30–31). అప్పుడు చక్రవర్తి నీరో. క్రీ.శ. 60ల ప్రపంచం ఇదిగో.
బ్రిటన్‌లో ఐసెని తెగ రాణి బౌడికా గొప్ప తిరుగుబాటుకు నాయకత్వం వహించి, లండన్‌గా మారిన యువ రోమా పట్టణం లొండీనియంను తగలబెట్టింది; తరువాత రోమీయులు ఆమెను ఓడించారు.
అలెగ్జాండ్రియాలో ఇంజనీరు హీరో ఆవిరితో తిరిగే ఒక గోళాన్ని, గాలితో నీటితో పనిచేసే యంత్రాలను వర్ణించాడు. అతడు ప్రస్తావించే ఒక చంద్రగ్రహణం క్రీ.శ. 62 నాటి గ్రహణంతో సరిపోతుంది; సాధారణంగా దాని ఆధారంగానే అతని కాలాన్ని నిర్ణయిస్తారు.
చైనా సంప్రదాయం ప్రకారం హాన్ చక్రవర్తి మింగ్ ఒక బంగారు రూపాన్ని కలలో చూసి పశ్చిమానికి రాయబారులను పంపాడు. వారు బౌద్ధ భిక్షువులతో, గ్రంథాలతో తిరిగి వచ్చారు; వారి కోసం లువోయాంగ్లో తెల్ల గుర్రం దేవాలయం కట్టబడింది — చైనాలో మొదటి బౌద్ధ దేవాలయం.
మధ్య ఆసియా నుండి వచ్చిన కుషాణ రాజులు నేటి అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, ఉత్తర భారతదేశం అంతటా ఒక సామ్రాజ్యాన్ని నిర్మించారు. వారి భూభాగాలు రోమ్ను, భారతదేశాన్ని, చైనాను కలిపే మార్గాలపై ఉండేవి.
సుమారు 1110లో సంకలనమైన కీవ్ “ప్రాథమిక వృత్తాంతం” ప్రకారం, అపొస్తలుడు అంద్రెయ నీపర్ నదిలో పైకి ప్రయాణించి, కీవ్ నిలవబోయే కొండలపై ఒక సిలువను నిలబెట్టి, అక్కడ ఒక గొప్ప నగరం వస్తుందని ముందే చెప్పాడు. చరిత్రకారులు దీన్ని ఒక పురాణగాథగా చూస్తారు; అంతకంటే పాత సంప్రదాయం అంద్రెయకు స్కుతియాను సువార్త క్షేత్రంగా ఇస్తుంది.
మూలాలు: Theographic Bible Metadata, CC BY-SA 4.0 · OpenBible.info, CC BY 4.0 · ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు