నూతన రాజ్యపు ఫరోల్లో అందరికంటే ప్రసిద్ధుడైన ఇతడు అబూ సింబెల్ దేవాలయాలను, డెల్టాలో పై-రామెసేసు అనే కొత్త రాజధానిని కట్టించాడు. ఒక అభిప్రాయం ప్రకారం నిర్గమన కాలపు ఫరో ఇతడే; బైబిలు ఆ ఫరో పేరు చెప్పదు.
విజ్ఞాన సర్వస్వం › ఇదే సమయంలో లోకంలో
బైబిల్‌లో · క్రీ.పూ. 15వ లేదా 13వ శతాబ్దం (కాలనిర్ణయంపై వాదం ఉంది) · రామెసేసు, నైలు డెల్టాలో
నిర్గమం
పస్కా రాత్రి తరువాత ఇశ్రాయేలీయులు రామెసేసు నుండి బయలుదేరుతారు. పండితులు నిర్గమాన్ని సుమారు క్రీ.పూ. 1446 నాటిదిగా గానీ, క్రీ.పూ. 13వ శతాబ్దం నాటిదిగా గానీ నిర్ణయిస్తారు.
ఆ అర్థరాత్రి సమయంలో ఏం జరిగిందంటే, ఐగుప్తు దేశంలో ఉన్న మొదటి సంతానమంతటినీ యెహోవా హతమార్చాడు. సింహాసనం మీద కూర్చున్న రాజు మొదలుకుని, చెరసాలలోని ఖైదీల వరకూ వాళ్ళకు పుట్టిన మొదటి పిల్లలు మరణించారు. పశువుల తొలిచూలు పిల్లలు చనిపోయాయి. ఆ రాత్రి గడిచిన తరువాత మరణం సంభవించని ఇల్లు ఒక్కటి కూడా లేదు. ఐగుప్తు దేశంలో తీవ్రమైన మరణ రోదన చెలరేగింది. ఫరో మోషే అహరోనులను పిలిపించాడు. వాళ్ళతో “మీరూ ఇశ్రాయేలు ప్రజలూ త్వరగా నా దేశం నుండి, నా ప్రజల మధ్యనుండి వెళ్ళిపొండి. మీరు కోరుకున్నట్టు వెళ్లి యెహోవాను ఆరాధించండి. మీ ఇష్టప్రకారం మీ మందలనూ పశువులనూ తోలుకు వెళ్ళండి. నన్ను దీవించండి కూడా” అన్నాడు. ఐగుప్తీయులు మేము కూడా చనిపోతాం అనుకుని ఆత్రంగా ఇశ్రాయేల్ ప్రజను తమ దేశం నుండి వెళ్ళిపొమ్మని తొందర పెట్టారు. ఇశ్రాయేలు ప్రజలు పొంగజేసే పదార్థం కలపని తమ పిండి ముద్దలు, పిండి పిసికే గిన్నెలు మూటగట్టుకుని భుజాలపై మోసుకు పోయారు. అంతకుముందు ఇశ్రాయేలు ప్రజలు మోషే చెప్పిన మాట ప్రకారం ఐగుప్తీయుల దగ్గర నుండి వెండి, బంగారం నగలు, దుస్తులు అడిగి తీసుకున్నారు. ఐగుప్తీయులకు ఇశ్రాయేలు ప్రజల పట్ల యెహోవా జాలి గుణం కలిగించడం వల్ల వారు ఇశ్రాయేలు ప్రజలు అడిగినవన్నీ ఇచ్చారు. ఆ విధంగా వారు ఐగుప్తీయులను దోచుకున్నారు. తరువాత ఇశ్రాయేలు ప్రజలు రామెసేసు నుండి సుక్కోతు వరకూ ప్రయాణం సాగించారు. వారిలో పిల్లలు కాక, కాలి నడకన బయలుదేరిన పురుషులు ఆరు లక్షల మంది. అంతేకాక వేరువేరు జాతుల మనుషులు చాలా మంది వారితో వచ్చారు. గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువులతో కూడిన గొప్ప మందలు కూడా వాళ్ళతో కలసి బయలుదేరాయి. తరువాత వాళ్ళు ఐగుప్తు నుండి తెచ్చిన పిండి ముద్దలతో పొంగని రొట్టెలు కాల్చారు. ఆ పిండి ముద్ద పులియలేదు. వాళ్ళు ఐగుప్తునుండి బయలు దేరే ముందు సమయం లేకపోవడం వల్ల తమ కోసం వేరే ఆహారం సిద్ధం చేసుకోలేక పోయారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలం 430 సంవత్సరాలు. ఆ 430 సంవత్సరాలు ముగిసిన రోజునే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశం నుండి తరలి వెళ్లాయి. ఆయన ఐగుప్తు దేశం నుండి వారిని బయటికి రప్పించిన ఆ రాత్రి యెహోవా కోసం కేటాయించి ఇశ్రాయేలు ప్రజలంతా తరతరాలకూ ఆ రాత్రి యెహోవా కోసం జాగారం చెయ్యాలి.అదే సమయంలో లోకంలో
నిర్గమనం ఎప్పుడు జరిగిందనే దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఒక అభిప్రాయం ప్రకారం, 1 రాజులు 6:1 నుండి వెనక్కి లెక్కిస్తే అది క్రీ.పూ. 15వ శతాబ్దంలో; మరొక అభిప్రాయం ప్రకారం, రెండవ రామెసేసు నైలు డెల్టాలో పట్టణాలు కట్టిన క్రీ.పూ. 13వ శతాబ్దంలో (నిర్గమకాండం 1:11 రామెసేసు పేరు చెబుతుంది). దానికి కాలం నిర్ణయించలేమని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. ఆ శతాబ్దాల ప్రపంచం ఇదిగో.
రెండవ రామెసేసు కొడుకైన ఫరో మెర్నెప్తా విజయ శిలాఫలకం కనానులో అతడు ఓడించిన ప్రజల్లో “ఇశ్రాయేలు”ను పేర్కొంటుంది — బైబిలు బయట దొరికిన ఇశ్రాయేలు ప్రస్తావనల్లో ఇదే అతి పురాతనమైనది. అది ఇప్పుడు కైరోలోని ఈజిప్షియన్ మ్యూజియంలో ఉంది.
గ్రీసులో మైసీనే యోధ రాజులు తమ కోటకు సింహ ద్వారం కట్టించారు. రాజభవనాలు, యుద్ధాల ఈ యుగాన్ని తరువాత హోమర్ ట్రోయ్ యుద్ధ గాథలు గుర్తుచేసుకున్నాయి.
షాంగ్ రాజవంశపు చివరి రాజధాని ఆన్యాంగ్‌లో రాజులు ఎద్దు ఎముకలను, తాబేలు చిప్పలను వేడితో పగులగొట్టి తమ పూర్వీకులను ప్రశ్నలడిగి, జవాబులను వాటిపైనే రాశారు. ఈ “శకున ఎముకలే” తెలిసినంతవరకు అతి పురాతన చైనా లిపి.
వాయవ్య భారతదేశంలో కవులు హిందూ మతపు అతి పురాతన పవిత్ర గ్రంథాలైన ఋగ్వేద సూక్తాలను సంస్కృతంలో రచించారు. రాయబడడానికి ముందు అవి అనేక శతాబ్దాల పాటు కంఠస్థంగా తరతరాలకు అందాయి.
మెక్సికో గల్ఫ్ తీరంలో శాన్ లోరెంజో ఓల్మెక్ ప్రజలు భారీ రాతి తలలను చెక్కారు; కొన్ని దాదాపు 3 మీటర్ల ఎత్తు ఉన్నాయి. మెసో అమెరికాలో వారే మొదటి గొప్ప నాగరికత.
నీపర్ నది నుండి యూరల్ పర్వతాల వరకు, దుంగలు పేర్చిన సమాధుల వల్ల “కలప సమాధి” సంస్కృతి అని పేరు పొందిన కంచు యుగపు పశుపాలకులు స్టెప్పీ మైదానాల్లో పశువులను, గొర్రెలను పెంచుతూ నదుల వెంబడి చిన్న గ్రామాల్లో నివసించారు.
మూలాలు: Theographic Bible Metadata, CC BY-SA 4.0 · OpenBible.info, CC BY 4.0 · ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు