Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › మార్గాలు › అబ్షాలోము నుండి దావీదు పారిపోతాడు

మార్గాలు

అబ్షాలోము నుండి దావీదు పారిపోతాడు

ఒలీవల కొండ మీదుగా మహనయీముకు, గిల్గాలు మీదుగా తిరిగి · 7 మజిలీలు · సరళ రేఖల్లో ≈ 130 కి.మీ.

యెరూషలేముబహూరీముమహనయీముగిల్గాలు10 కి.మీ.123456

© OpenStreetMap contributors

మజిలీలు

  1. యెరూషలేము2 సమూ 15:14దావీదు యెరూషలేములో ఉన్న తన సేవకులకందరికీ ఇలా ఆజ్ఞ ఇచ్చాడు “అబ్షాలోము చేతిలో నుండి మనం తప్పించుకుని బతకలేము. మనం పారిపోదాం పదండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకుని, మనకు కీడు చేయక ముందే, నగరంలో హత్యాకాండ జరిపించకముందే మనం త్వరగా వెళ్లిపోదాం రండి.”
  2. కిద్రోను2 సమూ 15:23వారు కొనసాగిపోతూ ఉన్నప్పుడు ప్రజలంతా బాగా రోదించారు. ఈ విధంగా వారంతా రాజుతో కలసి కిద్రోనువాగు దాటి ఎడారి వైపు ప్రయాణమై వెళ్ళారు.
  3. ఒలీవ చెట్ల కొండ2 సమూ 15:30దావీదు తన తల కప్పుకుని, ఏడుస్తూ, చెప్పులు లేకుండా నడుచుకొంటూ ఒలీవ చెట్ల కొండ ఎక్కుతూ వెళ్ళాడు. అతనితో ఉన్నవారంతా తలలు కప్పుకుని ఏడుస్తూ కొండ ఎక్కారు.
  4. బహూరీము2 సమూ 16:5రాజైన దావీదు బహూరీము దగ్గర కు వచ్చినప్పుడు సౌలు కుటుంబానికి చెందిన గెరా కుమారుడు షిమీ అనేవాడు అక్కడికి వచ్చాడు.
  5. మహనయీము2 సమూ 17:24దావీదు మహనయీముకు చేరేటప్పటికి అబ్షాలోము, ఇశ్రాయేలీయులంతా యొర్దాను నది దాటి వచ్చారు.
  6. గిల్గాలు2 సమూ 19:15యూదావారు రాజును ఎదుర్కొవడానికి, నది ఇవతలకు వెంటబెట్టుకు రావడానికి గిల్గాలుకు వచ్చారు.
  7. యెరూషలేము2 సమూ 20:3దావీదు యెరూషలేములోని తన నగరానికి వచ్చాడు. తన ఇంటికి కాపలాగా ఉంచిన తన ఉపపత్నులు పదిమంది స్త్రీలను కాపాడుతూ వారిని పోషిస్తున్నాడు గానీ వారితో లైంగిక సంబంధం పెట్టుకోలేదు. వారు కాపలాలో ఉండి జీవించినంత కాలం వితంతువుల వలె ఉండిపోయారు.

రేఖలు పాఠ్యంలోని క్రమంలో మజిలీలను కలుపుతాయి. రేఖ నేల ఆకృతిని అనుసరించే చోట, అది ఒక పండితుడు తిరిగి రూపొందించిన సంభావ్య దారి; మిగతా చోట్ల సరళ రేఖ — దారి తెలియదు. దూరాలు మజిలీల మధ్య సరళ రేఖలు. విరిగిన గీత: ఓడలో. లేత: స్థలం అనిశ్చితం.

ప్రతి బిందువు అత్యంత సంభావ్య స్థానం; లేత బిందువు అంటే గుర్తింపు అనిశ్చితం. స్థానం తెలియని స్థలాలు మ్యాప్‌పై లేవు.

మూలాలు: OpenBible.info, CC BY 4.0 · UBS Bible Routes, Dr Leen Ritmeyer © United Bible Societies 2023, CC BY-SA 4.0 · ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు