అన్వేషించండి › పాత మ్యాప్‌లు › పవిత్ర భూమి, తిలేమాన్ స్టెల్లా
మ్యాప్‌ను పూర్తి పరిమాణంలో తెరవండి (3000 × 2287)
పాత మ్యాప్‌లు · సుమారు 1600
పవిత్ర భూమి, తిలేమాన్ స్టెల్లా మ్యాప్ తయారీదారు: Stella, Tilemann · సంవత్సరం: సుమారు 1600
జర్మన్ పండితుడు తిలేమాన్ స్టెల్లా గీసి, ఆంట్వెర్ప్లో గెరార్డ్ డి జోడ్ ప్రచురించిన వాగ్దాన దేశపు పటం. తీరం పైభాగం వెంబడి ఉంది, అంటే పడమర పైన ఉంది, దేశాన్ని ఇశ్రాయేలు గోత్రాల మధ్య పంచి చూపించారు. కింది అంచు వెంబడి యెరూషలేము దృశ్యం ఉంది, ఎడమవైపు బేత్లెహేములోని ప్రార్థనా మందిరం, కుడివైపు పవిత్ర సమాధి మీద ఉన్న ప్రార్థనా మందిరం.
Library of Congressలో మ్యాప్
భాగాలు సంఖ్యా 34:1–12 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “నువ్వు ఇశ్రాయేలీయులతో చెప్పు, ‘కనాను దేశంలో, అంటే ఏ దేశాన్ని మీరు చీట్లు వేసి వారసత్వంగా పంచుకోబోతున్నారో ఆ దేశంలో మీరు ప్రవేశిస్తున్నారు. మీ దక్షిణపు సరిహద్దు సీను అరణ్యం మొదలు ఎదోము సరిహద్దు వరకూ, అంటే, ఉప్పు సముద్రం తూర్పు తీరం వరకూ ఉంటుంది. మీ సరిహద్దు దక్షిణం మొదలు అక్రబ్బీము కనుమ దగ్గర తిరిగి సీను వరకూ వ్యాపిస్తుంది. అది దక్షిణం నుండి కాదేషు బర్నేయ వరకూ వ్యాపించి, అక్కడ నుండి హసరద్దారు వరకూ పోయి, అక్కడ నుండి అస్మోను వరకూ కొనసాగుతుంది. అస్మోను నుండి ఐగుప్తు నది వరకూ సరిహద్దు తిరిగి సముద్రం వరకూ వ్యాపిస్తుంది. మీకు పడమటి సరిహద్దుగా మహాసముద్రం ఉంటుంది. మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రం నుండి హోరు కొండ దాకా, హోరు కొండ నుండి హమాతుకు వెళ్ళే దారి వరకూ ఏర్పాటు చేసుకోవాలి. ఆ సరిహద్దు సెదాదు వరకూ, అక్కడ నుండి జిప్రోను వరకూ వ్యాపిస్తుంది. దాని అంచు హసరేనాను దగ్గర ఉంటుంది. అది మీకు ఉత్తరపు సరిహద్దు. తూర్పు సరిహద్దు హసరేనాను నుండి షెపాము వరకూ మీరు లెక్కించుకోవాలి. అది షెపాము నుండి అయీనుకు తూర్పున రిబ్లా వరకూ ఉంటుంది. ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నెరెతు సముద్రపు ఒడ్డును తాకుతూ ఉంటుంది. అది యొర్దాను నది వరకూ దిగి ఉప్పు సముద్రం వరకూ వ్యాపిస్తుంది. ఆ దేశం చుట్టూ ఉన్న సరిహద్దుల మధ్య ఉన్న ప్రాంతమంతా మీ దేశం’ అని వారితో చెప్పు.”
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0 ; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు