అన్వేషించండి › పాత మ్యాప్‌లు › వాగ్దాన దేశం, లియేబో చెక్కినది
మ్యాప్‌ను పూర్తి పరిమాణంలో తెరవండి (1491 × 3000)
పాత మ్యాప్‌లు · సుమారు 1720
వాగ్దాన దేశం, లియేబో చెక్కినది మ్యాప్ తయారీదారు: Liebaux · సంవత్సరం: సుమారు 1720
అంతియొకయ నుండి ఐగుప్తు అంచు వరకు వాగ్దాన దేశపు ఎత్తైన, సన్నని పటం, యెహోషువా గ్రంథం మీద ఒక ఫ్రెంచి వ్యాఖ్యానం కోసం తయారైనది, భూగోళ శాస్త్రవేత్త లియేబో చెక్కినది. ఇది ప్రతి గోత్రపు భూభాగాన్ని గుర్తిస్తుంది, అనేక స్థలాలకు రెండు పేర్లు ఇస్తుంది, బైబిల్ పేరు, తరువాతి కాలపు పేరు.
Library of Congressలో మ్యాప్
భాగాలు యెహో 13:1–7 యెహోషువ వయసు మళ్ళిన వృద్ధుడు అయ్యాడు. యెహోవా అతనితో ఇలా చెప్పాడు. “నీవు బాగా వృద్ధుడివయ్యావు. స్వాధీనం చేసుకోడానికి ఇంకా అతి విస్తారమైన దేశం మిగిలి ఉంది. ఆ ప్రాంతాలేవంటే, ఫిలిష్తీయుల ప్రదేశాలన్నీ గెషూరీయుల దేశమంతా ఐగుప్తుకు తూర్పున ఉన్న షీహోరు నుండి కనానీయులవైన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకూ, ఫిలిష్తీయుల ఐదుగురు సర్దారులకు సంబంధించిన గాజీయుల, అష్డోదీయుల, అష్కెలోనీయుల, గాతీయుల, ఎక్రోనీయుల దేశాలూ దక్షిణ దిక్కున ఆవీయుల దేశమూ కనానీయుల దేశమంతా సీదోనీయుల మేరా నుండి ఆఫెకు వరకూ ఉన్న అమోరీయుల సరిహద్దు వరకూ గిబ్లీయుల దేశమూ హెర్మోను కొండ దిగువన ఉన్న బయల్గాదు నుండి హమాతుకు పోయే మార్గం వరకూ లెబానోను ప్రదేశమంతా లెబానోను నుండి మిశ్రేపొత్మాయిము వరకూ దేశం ఇంకా మిగిలి ఉంది. సీదోను ప్రజలతో సహా పర్వత ప్రాంతం ప్రజలందరినీ నేను ఇశ్రాయేలీయుల ముందు నుండి వెళ్లగొడతాను. కాబట్టి నేను ఆజ్ఞాపించిన విధంగా నీవు ఇశ్రాయేలీయులకు దాన్ని స్వాస్థ్యంగా పంచిపెట్టాలి. తొమ్మిది గోత్రాలకు, మనష్షే అర్థ గోత్రానికి ఈ దేశాన్ని స్వాస్థ్యంగా పంచిపెట్టు.”
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0 ; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు