ఫ్రెంచి రాజుకు భూగోళ శాస్త్రవేత్త అయిన నికోలస్ సాన్సన్ ప్రాచీన భూగోళ శాస్త్రవేత్తలు చేసినట్టే అరేబియాను విభజిస్తాడు: సీనాయి, ఎర్ర సముద్రం దగ్గర రాతి అరేబియా (పెట్రాయా), ఉత్తరాన ఎడారి అరేబియా, దక్షిణాన సంతోష అరేబియా (ఫెలిక్స్). ఈ పటాన్ని 1654లో పారిస్‌లో ప్రచురించారు, దాని శీర్షిక చెప్పినట్టు, అది యూరప్‌లో “నూబియన్” అనే పేరుతో తెలిసిన మధ్యయుగపు అరబ్ భూగోళ శాస్త్రవేత్త అల్-ఇద్రీసీ మీద కొంత ఆధారపడింది.